Anupama parameswaran: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటీమణుల్లో మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఎప్పటికప్పుడు తన కెరీర్, వ్యక్తిగత వివరాలకు సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వేదికగా పంచుకుంటూ ఉంటుందీ భామ. ఈ క్రమంలోనే తాజాగా అనుపమ ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు ఆమె అభిమానులను ఆట్టుకుంటున్నాయి. ఇంతకీ విషయమేమిటంటే.. అనుపమకు పెంపుడు శునకాలు అంటే ఎంతో ఇష్టం ఈ క్రమంలోనే పలు పెట్ డాగ్స్‌ను పెంచుకుంటోందీ అందాల తార.
అనుపమ పెంచుకుంటోన్న విస్కీ అనే పేరున్న పెంపుడు శునకం పుట్టినరోజు శనివారం. ఈ సందర్భంగా తన పెట్ డాగ్‌తో దిగిన కొన్ని ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఈ చిన్నది. ఆ ఫొటోలతో పాటు.. “నా విస్కీ బేబీ నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. గడిచిన రెండేళ్లు మాకు ఎంతో బాధను కలిగించాయి. కారణం.. విస్కీ ఇద్దరు సోదరులు టడ్డీ, రమ్లను కోల్పోయాం. మా జీవితాలను అద్భుతంగా మార్చినందుకు విస్కీకి కృతజ్ఞతలు. హ్యాపీ బర్త్‌డే విస్కీ.. మేము నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాం. నువ్వు నా దానివి.. నా దానివి మాత్రమే” అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. అనుపమకు తన పెంపుడు శునకంపై ఉన్న ప్రేమకు ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఇదిలా ఉంటే అనుపమ చివరిసారిగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన రాక్షసుడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అనంతరం 2020లో ఓ మలయాళం చిత్రంలో నటించిన ఈ చిన్నది.. ప్రస్తుతం తెలుగులో 18 పేజీస్‌తో పాటు.. తమిళంలో తల్లిపొగతే అనే చిత్రంలో నటిస్తోంది.
ఐడియా ఇవ్వు.. రూ.5 లక్షలు పట్టు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన కంపెనీ.. ఎప్పటివరకు ఛాన్స్ అంటే..