అనిల్ రావిపూడికి ‘ఇండియన్ పనోరమ’ అవార్డు

వరుసగా ఐదు హిట్లతో టాలీవుడ్‌లో స్టార్ దర్శకుడిగా వెలుగొందుతున్న అనిల్ రావిపూడి జాతీయ స్థాయి అవార్డును సొంతం చేసుకున్నారు

  • Tv9 Telugu
  • Publish Date - 4:13 pm, Wed, 21 October 20
అనిల్ రావిపూడికి 'ఇండియన్ పనోరమ' అవార్డు

Anil Ravipudi Award: వరుసగా ఐదు హిట్లతో టాలీవుడ్‌లో స్టార్ దర్శకుడిగా వెలుగొందుతున్న అనిల్ రావిపూడి జాతీయ స్థాయి అవార్డును సొంతం చేసుకున్నారు. ఇండియన్ పనోరమ ఫర్‌ 2019లో అనిల్‌కి అవార్డు లభించింది. ఎఫ్‌ 2 మూవీకి గానూ అనిల్‌ అవార్డును సొంతం చేసుకున్నారు.

దీనిపై సంతోషాన్ని వ్యక్తం చేసిన అనిల్‌.. వెంకటేష్, వరుణ్‌ తేజ్‌, ఎఫ్‌ 2 నటీనటులు, సాంకేతిక నిపుణులు, దిల్ రాజుకి ప్రత్యేక కృతఙ్ఞతలని వెల్లడించారు. కాగా 2019 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఎఫ్‌ 2లో ఉన్న వారితో పాటు మరో నటుడు భాగం అవుతున్నారు. ఇక సీక్వెల్‌ని కూడా దిల్‌ రాజునే నిర్మిస్తున్నారు.

Read More:

కరోనాతో 215 రోజుల తరువాత కలుసుకున్న వృద్ధ జంట.. భావోద్వేగ వీడియో వైరల్‌

Bigg Boss4: మోనాల్, అవినాష్‌ రొమాన్స్‌.. సచ్చిపోండి మీరిద్దరు అన్న అరియానా