
టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో కొన్ని పాటలు వయసుతో సంబంధం లేకుండా ఎప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంటాయి. అలాంటి ఆల్ టైమ్ క్లాసిక్ , ఎవర్ గ్రీన్ మాస్ సాంగ్స్ జాబితాలో ‘ప్రేమికుడు’ సినిమాలోని “అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే..” పాట ముందు వరుసలో ఉంటుంది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో డాన్స్ డెవిల్ ప్రభుదేవా, నగ్మా జంటగా నటించగా.. ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ ఈ పాటకు ప్రాణం పోసింది. దశాబ్దాలు గడుస్తున్నా ఈ పాటలోని ఎనర్జీ, మ్యూజిక్ బీట్స్ ఇప్పਤటికీ యువతను ఉర్రూతలూగిస్తూనే ఉన్నాయి. ఈ పాటలో ప్రభుదేవా వేసిన అద్భుతమైన స్టెప్పులు, ఆయన బాడీ లాంగ్వేజ్ అప్పట్లో ఓ సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా పాటలో వచ్చే యూనిక్ బీట్స్ , కొరియోగ్రఫీ సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. ఎంతకాలం గడిచినా ఈ పాట ట్యూన్ వినిపిస్తే చాలు ఎవరికైనా కాళ్లు వాటంతట అవే కదులుతాయి. సోషల్ మీడియా రీల్స్ నుండి పార్టీల వరకు ప్రతిచోటా ఈ పాటకు ఉండే క్రేజ్ వేరు.
ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..
ఏఆర్ రెహమాన్ కంపోజిషన్, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పల్లవి గాత్రాలు ఈ పాటకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. నాటి తరంతో పాటు నేటి తరం యువతను సైతం ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ చేసుకునే ఈ సాంగ్ మేజిక్ ఎప్పటికీ తగ్గదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్ మ్యూజికల్ హిట్స్‌లో ఎప్పటికీ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్న ఈ మాస్ సాంగ్ మానియా కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది.
ఎక్కువ మంది చదివినవి : Brahmanandam: వాళ్లు ఏదో అనుకుంటారని ఆగకు.. జీవితంపై బ్రహ్మానందం చెప్పిన అద్భుతమైన మాటలు..
డ్యాన్సింగ్ సెన్సేషన్ ప్రభుదేవా హీరోగా నటించగా, అందాల తార నగ్మా హీరోయిన్గా నటించిన ఈ చితర్ంలో ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్ ఈ చిత్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా, హీరోయిన్ తండ్రిగా కీలక పాత్ర పోషించారు. రాజకీయ కుట్రలు, ప్రేమ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను కట్టిపడేసింది. శంకర్ తనదైన మేకింగ్ స్టైల్‌తో ఒక సాధారణ లవ్ స్టోరీని కూడా కమర్షియల్ హంగులతో అద్భుతంగా తెరకెక్కించారు. ‘ప్రేమికుడు’ సినిమా అనగానే అందరికీ ముందుగా గుర్తువచ్చేది ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్. ఈ చిత్రంలోని పాటలన్నీ టాలీవుడ్లో ఆల్ టైమ్ చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి.
ఎక్కువ మంది చదివినవి : Kodi Ramakrishna: ఒక్క ఏడాదిలోనే 23 సినిమాలు చేసిన ఏకైక హీరో.. దాసరి గారు ఒక మాట అన్నారు.. డైరెక్టర్ కోడి రామకృష్ణ..
ఎక్కువ మంది చదివినవి : SV Krishna Reddy: ఆమె అద్భుతమైన హీరోయిన్.. మధ్యతరగతి పాత్రలకు సరిగ్గా సెట్ అవుతుంది.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..