
బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ గ్యారేజ్‌లో ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన, అత్యధిక ధర కలిగిన లగ్జరీ కార్లు ఎన్నో ఉన్నాయి. రూ. కోట్లు విలువ చేసే వాహనాలు ఆయన సొంతం. అయితే సాధారణంగా అమితాబ్ స్వయంగా డ్రైవింగ్ సీట్లో కూర్చోవడం చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ తాజాగా ఆయన ముంబైలోని తన నివాసం వెలుపల స్వయంగా డ్రైవింగ్ చేస్తూ కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. అది కూడా ఏ లగ్జరీ పెట్రోల్, డీజిల్ కార్ కాకపోవడం విశేషం. 83 ఏళ్ల వయసులోనూ బిగ్ బి ఎంతో ఉత్సాహంగా స్వదేశీ తయారీ సంస్థ అయిన మహీంద్రాకు చెందిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (EV) ని నడుపుతూ కెమెరాలకు చిక్కారు. ఈ చిత్రాలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, అనుష్క కాంబోలో మిస్సైన సినిమా.. కట్ చేస్తే.. ఆ హీరోయిన్‌తో బాస్ బ్లాక్ బస్టర్ హిట్..
అమితాబ్ కుటుంబానికి అత్యంత శక్తివంతమైన, అత్యంత ప్రీమియం ఎస్‌యూవీ అయిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా (Land Rover Defender Octa) కూడా ఉంది. రూ. 2.59 కోట్ల రేంజ్‌లో ఉండే ఈ కారు 4.4 లీటర్ల ట్విన్-టర్బో V8 ఇంజిన్‌తో ఏకంగా 635 హార్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కేవలం 3.8 సెకన్లలోనే 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. అంతటి హై-పెర్ఫార్మెన్స్ లగ్జరీ కార్ ఉన్నప్పటికీ, రోజువారీ ప్రయాణానికి అమితాబ్ బచ్చన్ మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఎంచుకోవడం విశేషం.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్.. ఒక్క పాటతో గెల్డోన్ బ్యూటీగా మార్చిన రాఘవేంద్రరావు.. ఇప్పటికీ ఆమె తోపు యాక్టర్..
మహీంద్రా సంస్థ రూపొందించిన ఈ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 650 కిలోమీటర్ల వరకు మైలేజ్ (రేంజ్) ఇస్తుంది. అలాగే, కేవలం 28 నిమిషాల్లోనే 10 నుండి 80 శాతం వరకు ఫాస్ట్ ఛార్జ్ అయ్యే సదుపాయం దీని సొంతం. ఇది రెండు బ్యాటరీ ప్యాక్‌ల ఎంపికను అందిస్తుంది. ఒకటి 59 kWh యూనిట్, ఇది 400 కి.మీ.ల వరకు రేంజ్‌ను అందిస్తుంది, మరొకటి పెద్దదైన 79 kWh ప్యాక్, ఇది ఒకే ఛార్జ్‌పై 656 కి.మీ.ల వరకు ప్రయాణిస్తుంది. టాప్ వేరియంట్ 230 bhp , 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, దీనితో ఇది సుమారు 7.9 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు. XEV 9e ఆధునిక, టెక్నాలజీతో నిండిన క్యాబిన్‌ను కలిగి ఉంది. ఇందులో 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.8-అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్, లెవెల్ 2 ADAS, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఇది 150 kW వరకు DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇటీవలి కాలంలో బాలీవుడ్ ప్రముఖులు ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా స్వీకరిస్తూ, ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారతీయ బ్రాండ్ అయిన మహీంద్రా ఈవీని అమితాబ్ బచ్చన్ డ్రైవ్ చేయడం వల్ల భారత ఎలక్ట్రిక్ వాహన రంగానికి పెద్ద ఎత్తున ప్రచారం లభించినట్లైంది.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఈ సినిమాకు ఏం డిమాండ్ రా బాబూ.. ఓటీటీలో గత్తరలేపుతున్న మూవీ.. ఫ్యామిలీతో అస్సలు చూడలేరు..
ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో నాకు బెస్ట్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు.. నయనతార..