Alludu Adhurs Movie: అల్లుడు అదుర్స్ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందంటారా? కారణాలు ఇలా ఉన్నాయి..

Alludu Adhurs Movie: ఈ సారి సంక్రాంతి ఎందుకో టాలీవుడ్‌కి కలిసి రావడం లేదనిపిస్తోంది. ఇప్పటికే క్రాక్‌ సినిమా అనుకున్న సమాయానికి విడుదల కాకుండా అడ్డంకులు

Alludu Adhurs Movie: అల్లుడు అదుర్స్ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందంటారా? కారణాలు ఇలా ఉన్నాయి..

Updated on: Jan 09, 2021 | 10:19 PM

Alludu Adhurs Movie: ఈ సారి సంక్రాంతి ఎందుకో టాలీవుడ్‌కి కలిసి రావడం లేదనిపిస్తోంది. ఇప్పటికే క్రాక్‌ సినిమా అనుకున్న సమాయానికి విడుదల కాకుండా అడ్డంకులు ఎదురయ్యాయి. అలాగే అల్లుడు అదుర్స్ కూడా సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతికి వస్తుందని చెప్తున్నారు దర్శక నిర్మాతలు. పైగా దీనికి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు. ఫినాన్షియల్స్ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. దాంతో ఎలాంటి సమస్యలు లేకుండా బెల్లంకొండ వస్తున్నాడని అనుకున్నారు.

అయితే షూటింగ్ ఆలస్యం కారణంగా ఈ చిత్రం అనుకున్న టైమ్ కు విడుదల కాలేకపోతుందంటూ వార్తలు వస్తున్నాయి. అందులో నిజం కూడా లేకపోలేదు. జనవరి 15న విడుదల కావాల్సిన ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. జనవరి 8న ఈ చిత్రంలోని పాట షూటింగ్ మొదలైంది. జనవరి 10న ఈ పాట చిత్రీకరణ ముగియనుంది. ఆ పాట ఇప్పుడు హైదరాబాద్‌లో తెరకెక్కిస్తున్నారు. 4 రోజుల్లోనే సినిమా షూటింగ్ అంతా పూర్తవ్వాలి.. ఎడిటింగ్, ఫైనల్ మిక్సింగ్, డీఐ ఇవన్నీ జరగాలంటే కచ్చితంగా ఇంకాస్త టైమ్ పడుతుంది. అయితే అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని దర్శక నిర్మాతలు కచ్చితంగా చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి తెలియలంటే వేచి చూడక తప్పదు.

Alludu Adhurs : ఒక్క రోజు ముందే ప్రేక్షకుల ముందుకు రానున్న బెల్లంకొండ ‘అల్లుడు అదుర్స్’..?

Follow Us