Pooja Hegde: ఆ సమయంలో చెప్పలేని అనుభూతికి లోనయ్యా.. బిగ్‌బితో నటించడంపై స్పందించిన బుట్టబొమ్మ..

Pooja Hegde: అనతికాలంలోనే అగ్ర హీరోయిన్‌ల జాబితాలో చోటు దక్కించుకుంది అందాల తార పూజా హెగ్డే. ఓవైపు హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే స్పెషల్‌ సాంగ్‌లో నటించి ఒక్కసారిగా...

Pooja Hegde: ఆ సమయంలో చెప్పలేని అనుభూతికి లోనయ్యా.. బిగ్‌బితో నటించడంపై స్పందించిన బుట్టబొమ్మ..

Updated on: Jul 18, 2022 | 6:15 AM

Pooja Hegde: అనతికాలంలోనే అగ్ర హీరోయిన్‌ల జాబితాలో చోటు దక్కించుకుంది అందాల తార పూజా హెగ్డే. ఓవైపు హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే స్పెషల్‌ సాంగ్‌లో నటించి ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుందీ బ్యూటీ. తెలుగులో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్‌ను టార్గెట్‌ చేస్తోంది. అక్కడ కూడా వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌తో ‘కభీ ఈద్‌ కభీ దివాళి’, రణ్‌వీర్‌ సింగ్‌ సరసన ‘సర్కస్‌’ సినిమాలతో బిజీగా ఉంది. ఇక కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ప్రకటనల్లోనూ నటిస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి ఓ కూల్‌ డ్రింక్‌ యాడ్‌లో నటించిన విషయం తెలిసిందే. అమితాబ్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడంపై పూజా తాజాగా ఓపెన్‌ అయ్యింది. ఈ విషయమై పూజా మాట్లాడుతూ.. ‘అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృ​ష్టం. నాలాంటి వారికి అమితాబ్‌ గురువులాంటివారు. ఇంత వయసులో కూడా ఆయన సమయపాలన, డెడికేషన్‌ నాకెంతో నచ్చాయి. ఆయన మనవరాలిగా నటిస్తున్నప్పుడు చెప్పలేని అనుభూతికి లోనయ్యాను’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us