Heroine katrina kaif: జిమ్‏లో లెగ్ వర్కవుట్స్ స్టార్ట్ చేసిన బాలీవుడ్ హీరోయిన్.. నెట్టింట్లో వీడియో వైరల్..

| Edited By: Pardhasaradhi Peri

Jan 07, 2021 | 10:11 PM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ జిమ్‏లో వర్కవుట్ స్టార్ట్ చేసింది. జిమ్‏లో వర్కవుట్లు చేస్తూ.. మరోవైపు తన అభిమానులకు ఫిట్‏నెస్‏కు సంబంధించిన సూచనిలిస్తుంది.

Heroine katrina kaif: జిమ్‏లో లెగ్ వర్కవుట్స్ స్టార్ట్ చేసిన బాలీవుడ్ హీరోయిన్.. నెట్టింట్లో వీడియో వైరల్..
Follow us on

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ జిమ్‏లో వర్కవుట్ స్టార్ట్ చేసింది. జిమ్‏లో వర్కవుట్లు చేస్తూ.. మరోవైపు తన అభిమానులకు ఫిట్‏నెస్‏కు సంబంధించిన సూచనిలిస్తుంది. శరీరం ఫిట్‏గా ఉండేందుకు ప్రస్తుతం లెగ్ వర్కవుట్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. కత్రినా జిమ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో కత్రినా మోకాళ్ళ పై డంబుల్స్‏తో వర్కవుట్ చేస్తుండగా.. బ్యాక్ డ్రాప్‏లో వెస్టర్న్ స్టైల్ మ్యూజిక్ ప్లే అవుతుంది. తన ఫిట్‏నెస్ ట్రైనర్ యాస్మిన్ కరాచివాలాతో కలిసి మళ్ళీ ముందు సైజ్‏లోకి మారెందుకు తెగ ప్రయత్నిస్తోంది బ్యూటీ. కత్రినా కైఫ్ తన జిమ్ వీడియో షేర్ చేస్తూ యాస్మిన్ “నాతో ఎప్పుడూ అడుగు వేయిస్తారు” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక న్యూఇయర్ సందర్బంగా కత్రినా తన సోదరి ఇజాబెల్లే కైఫ్, కోస్టార్ విక్కీ కౌశల్‏లో షేర్ చేసిన ఫోటో నెట్టింట్లో వైరల్ అయింది.