
ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించిన ఆయన.. ఆ తర్వాత దర్శకుడిగానూ సక్సెస్ అయ్యారు. తెలుగులో పలు చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వృత్తి, వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన అనుబంధం, అలాగే జీవితం పట్ల తనకున్న దృక్పథంపై ఆయన మాట్లాడారు. సముద్రఖని మాట్లాడుతూ, మహేష్ బాబుతో సర్కారు వారి పాట చిత్రం చేసిన సమయంలో పది కళ్లజోళ్లను అడిగితే, మహేష్ పంపించారని, “ఒక కళ్లజోడు ఏంటి, షాప్ ఇప్పిద్దును” అని అన్నారని గుర్తు చేసుకున్నారు. మహేష్ బాబు కేవలం అద్భుత నటుడు మాత్రమే కాదని, గొప్ప మానవతావాది అని, అలాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంటుందని ప్రశంసించారు. మహేష్‌తో తనకున్న బంధం చాలా ప్రత్యేకమైనదని సముద్రఖని ఈ సందర్భంగా చెప్పారు.
ఎక్కువ మంది చదివినవి : KS Chitra : తెలుగులో పెద్ద హీరోయిన్.. ఆమెకు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని.. చిత్ర..
తన కెరీర్ ప్రస్థానం గురించి అడగ్గా, సముద్రఖని ఒక వినూత్న దృక్పథాన్ని వెల్లడించారు. తాను ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడనని, “ఇంకా ఏమీ చేయలేదు” అనే భావనతోనే ఉంటానని చెప్పారు. ఈ వైఖరి కొత్త పనులు చేయడానికి, నిరంతరం ముందుకు సాగడానికి తనను ప్రేరేపిస్తుందని వివరించారు. ఎప్పుడైతే “ఏదో ఒకటి చేసేసాము” అనే భావన కలుగుతుందో, అప్పుడు కొత్తగా ఆలోచించే శక్తి తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒక్క పాట కోసం 365 రోజులు థియేటర్లు షేక్ అయ్యాయి.. అప్పట్లో టాప్ లేపేసిన సాంగ్..
దర్శకుడు రాజమౌళి RRR తన మొదటి సంతకం చేసిన చిత్రమని, అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురంలో మొదట విడుదలయ్యిందని సముద్రఖని తెలిపారు. హనుమాన్ చిత్రంలో విభీషణుడి పాత్ర పోషించిన ఆయన, జై హనుమాన్ చిత్రంలోనూ అదే పాత్రలో కొనసాగుతానని స్పష్టం చేశారు. వారణాసి చిత్రంలో పాత్ర గురించి అడగ్గా, ఇంకా పిలుపు రాలేదని, వస్తే తప్పకుండా వెళ్తానని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..
Samuthirakani, Mahesh Babu
ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..