పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ ఫైట్ సాగుతోంది. ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతానికి ఈ రాష్ట్రంలో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 114 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 110 సీట్లలో బీజేపీ లీడింగ్ లో ఉంది. క్షణ క్షణానికీ లెక్కలు మారుతున్నాయి. నందిగ్రామ్ నియోజకవర్గంలో మొదట మమత ఆధిక్యంలో ఉన్నట్టు కనబడినా ఆ తరువాత బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి లీడింగ్ లోఉన్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గం పైనే అందరి కళ్ళూ ఉన్నాయి.ఇక్కడ తాజా ట్రేండింగ్ ప్రకారం మమత వెనుకబడ్డారు. ఈ రాష్ట్రంలో రెండు చోట్ల లెఫ్ట్, మరో రెండు చోట్ల ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు. ఇక తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకె దూసుకుతోంది. కేరళలో లెఫ్ట్ కూటమి హవా అప్పుడే కనబడుతోంది. పాలక్కాడ్ నియోజకవర్గంలో మెట్రో మ్యాన్ శ్రీధరన్ ఆధిక్యంలో ఉన్నారు.పోస్టల్ బ్యాలెట్లలో ఈయనకే ఆధిక్యం లభించింది. అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీపోటీ సాగుతోంది. .పుదుచ్చేరిలో బీజేపీ తన ట్రేండింగ్ నిరూపించుకుంటోంది.
మరిన్ని చదవండి ఇక్కడ : ఉత్కంఠ రేపుతున్న ఓట్ల లెక్కింపు.. గెలిచేదెవరు? మరికాసేపట్లో అభ్యర్థుల భవితవ్యం:5 States Assembly Election Results 2021 Live Video.