లోక్‌సభ ఎన్నికల అభ్యర్థులు

లోక్‌సభను భారత పార్లమెంటులో దిగువ సభ అంటారు. లోక్‌సభ సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా ఓటువేసి ఎన్నుకుంటారు. లోక్‌సభ సభ్యులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోబడతారు. లోక్ సభకు మొదటి ఎన్నికలు 1951-52లో జరిగాయి. 543 మంది లోక్‌సభ సభ్యుల ఎన్నికకు సంబంధించి సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఇటీవల విడుదలయ్యింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు మొత్తం ఏడు విడతల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి. యూపీలో మొత్తం 80 సీట్లు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి యూపీలోని వారణాసి నుంచి పోటీ చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అమిత్ షా, రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీ, మల్లికార్జున ఖర్గే తదితర ప్రముఖ నేతలు పోటీ చేయనున్నారు.

అభ్యర్థుల జాబితా 2024

రాష్ట్రం అభ్యర్థి పార్టీ సీటు
Telangana Asaduddin Owaisi ఏఐఎంఐఎం హైదరాబాద్‌
Telangana Bandi Sanjay Kumar బీజేపీ కరీంనగర్
Telangana G Kishan Reddy బీజేపీ సికింద్రాబాద్
Telangana Nama Nageswr Rao TRS ఖమ్మం
Andhra Pradesh P V Midhun Reddy వైఎస్‌ఆర్‌సీపీ Rajampet

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థి భారత దేశ పౌరులై ఉండాలి. లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల సంఖ్య గత కొన్ని దశాబ్ధాలుగా గణనీయంగా పెరిగింది. 1952 నుంచి 2019 వరకు అభ్యర్థుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. 1952 సార్వత్రిక ఎన్నికల్లో 1,874 మంది అభ్యర్థులు పోటీచేయగా.. 2019లో 8,039 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఒక్కో నియోజకవర్గానికి పోటీచేసే అభ్యర్థులు సరాసరిగా 4.67 నుంచి 14.8కి పెరిగింది. 1977లో ఆరవ లోక్‌సభ ఎన్నికల వరకు సగటున ఒక లోక్‌సభ స్థానానికి కేవలం మూడు నుండి ఐదుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ చేసేవారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా సగటున 14.8 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 2019 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో 542 పార్లమెంటరీ నియోజకవర్గ స్థానాల నుండి 8,039 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

ప్రశ్న:- లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి ఎన్ని ఏళ్లు నిండి ఉండాలి?

సమాధానం:- రాజ్యాంగంలోని 84(బీ) సెక్షన్ మేరకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయాలనుకునే అభ్యర్థికి 25 ఏళ్లు నిండి ఉండాలి.

ప్రశ్న:- కొన్ని లోక్‌సభ సీట్లు ఎవరి కోసం రిజర్వ్ చేయబడ్డాయి?

సమాధానం:- దేశ వ్యాప్తంగా కొన్ని సీట్లు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల కోసం రిజర్వ్ చేయబడింది.

ప్రశ్న:- లోక్‌సభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు?

సమాధానం:- అర్హులైన ఓటర్లు తమ ఓటు ద్వారా ప్రత్యక్షంగా లోక్‌సభ సభ్యులను ఎన్నుకుంటారు.

ప్రశ్న: – లోక్‌సభలో మెజార్టీ కోసం ఎంత మంది సభ్యులు కావాలి?

సమాధానం:- లోక్‌సభలో మెజార్టీ కోసం 272 మంది సభ్యుల మద్ధతు కావాలి.

ప్రశ్న: – లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఎంత మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది?

సమాధానం:- అభ్యర్థులు తమ నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి దగ్గర రూ.10 వేల సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.5 వేలు డిపాజిట్ చేయాలి.

ప్రశ్న:- ఎన్నికల్లో అభ్యర్థులు డిపాజిట్ కోల్పోవడం అంటే ఏంటి?

సమాధానం:- నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లలో ఆరో వంతు కంటే తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థి తాను నామినేషన్ దాఖలు సమయంలో చెల్లించిన డిపాజిట్‌ను కోల్పోవాల్సి ఉంటుంది.

ఎన్నికల వార్తలు 2024

ఎన్నికల వీడియో