మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి
Rajampet వైఎస్‌ఆర్‌సీపీవైఎస్‌ఆర్‌సీపీ

పి.వి. మిధున్ రెడ్డి రాజకీయ కుటుంబానికి చెందిన యువ నాయకుడు. ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా రాజంపేట నుంచి పార్లమెంట్ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారునిగా ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. 2014లో రాజంపేట లోక్ సభ స్థానం నుంచి స్వర్గీయ ఎన్టీ రామారావు కుమార్తె దగ్గుపాటి పురంధేశ్వరి బీజేపీ తరఫున పోటీ చేస్తే.. ఆమెపై ప్రత్యర్థిగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత 2019లో కూడా ఇదే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన డీ కే సత్యప్రభపై భారీ మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా, నిధుల సేకరణ కోసం బీజేపీపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నేతగా రికార్డుకెక్కారు. ప్రస్తుతం 2024 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. ఈ సారి పోటీలో గెలిస్తే వరుసగా మూడు సార్లు పార్లమెంట్ కు ఎన్నికైన యువ నేతగా సరికొత్త రికార్డును సృష్టిస్తారు. వైసీపీ అధినేత ఈసారి కూడా ఈయనకే టికెట్‎ను కేటాయించారు.

ఎన్నికల వార్తలు 2024

ఎన్నికల వీడియో