జీ కిషన్ రెడ్డి

జీ కిషన్ రెడ్డి
సికింద్రాబాద్ బీజేపీబీజేపీ

జి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ యువనేత. రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి.. 1977లో జనతా పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. 1980లో బీజేపీ ఆవిర్భావం నుంచి వివిధ హోదాల్లో కిషన్ రెడ్డి ఆ పార్టీలో పనిచేస్తున్నారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా కేంద్ర మంత్రి స్థాయికి కిషన్ రెడ్డి ఎదిగారు. ప్రస్తుతం ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన బరిలో దిగనున్నారు. 
జీ కిషన్ రెడ్డి 2010 మార్చి 6న బీజేపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2004 శాసనసభ ఎన్నికల్లో తొలిసారి ఆయన హిమాయత్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. 2009 ఎన్నికల్లో అంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి వరుసగా రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ఆయన.. 2012లో 22 రోజులపాటు పోరుయాత్ర చేపట్టారు. 
2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్  నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు. నరేంద్ర మోదీ కేబినెట్‌‌లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2021లో చేపట్టిన కేబినెట్ విస్తరణలో భాగంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని మాసాలకు ముందుగా బీజేపీ అధిష్టానం కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా నియమించింది.

ఎన్నికల వార్తలు 2024

ఎన్నికల వీడియో