నామా నాగేశ్వర రావు

నామా నాగేశ్వర రావు
ఖమ్మం TRSTRS

నామా నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ ప్రముఖుల్లో ఒకరు. భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)కి చెందిన ఆయన ప్రస్తుతం ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ ఎంపీగా ఉన్నారు. మొదటిసారి ఆయన 2004లో టీడీపీ అభ్యర్థిగా ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరిపై విజయం సాధించారు. 2009 ఎన్నికల్లోనూ రేణుకా చౌదరిపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి 11వేల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్ధతుతో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓటమి చెందారు. 
2019 మార్చి 21న బీఆర్ఎస్‌లో చేరిన ఆయన.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేతగా పనిచేశారు. రాజకీయ అరంగేట్రానికి ముందు నామా నాగేశ్వరరావు విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు సాధించారు. మధుకాన్ కంపెనీకి ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2009 లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువ రూ.173 కోట్లుగా ప్రకటించారు. నాటి లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్‌సభకు పోటీ చేసిన వారిలో అత్యంత ధనవంతుడిగా ఆయన నిలిచారు.

ఎన్నికల వార్తలు 2024

ఎన్నికల వీడియో