హైదరాబాద్ లోక్‌ సభ స్థానం (Hyderabad Lok Sabha Constituency)

హైదరాబాద్ లోక్‌ సభ స్థానం (Hyderabad Lok Sabha Constituency)

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలున్నాయి. అందులో కీలకమైన పార్లమెంట్ నియోజకవర్గాల్లో హైదరాబాద్ ఒకటి. ఇది తెలంగాణకే గుండెలాంటిది. హైదరాబాద్ లోక్‌సభ స్థానం ప్రస్తుతం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కలిగి ఉంది. వీటిలో మలక్‌పేట, కారవాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా ఉన్నాయి. ఇక ఓటర్ల పరంగా చూస్తే ఈ లోక్‌సభ నియోజకవర్గంలో 9,45,277 మంది పురుష ఓటర్లు, 10,12,522 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తం కలిపి 19,57,799 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పాటు అయినప్పటికీ 2008లో డీలిమిటేషన్ చేశారు.

 

1984 నుండి ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. అసదుద్దీన్ తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ వరుసగా 6 సార్లు ఈ స్థానంలో గెలుపొందారు. 1996లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు బీజేపీ తరఫున పోటీ చేసి సలావుద్దీన్ చేతిలో 73 వేల ఓట్లతో ఓడిపోయారు. తండ్రి ప్రస్థానం ముగిశాక 2019 లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి వరుసగా నాలుగోసారి విజయం సాధించారు అసదుద్దీన్ ఓవైసీ. అయితే బీజేపీ నుంచి భగవంత రావు, బీఆర్ఎస్ నుంచి పుస్తే శ్రీకాంత్, కాంగ్రెస్ నుంచి ఫిరోజ్ ఖాన్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2024లో కూడా అసదుద్దీన్ ఒవైసీ పోటీ చేసే అవకాశం ఉంది. బీజేపీ తరఫున విరించి హాస్పిటల్ మాజీ ఛైర్మన్ మాధవి లత పోటీ చేస్తున్నారు.

అభ్యర్థి పేరు ఫలితాలు మొత్తం ఓట్లు ఓట్ల శాతం %
Asaduddin Owaisi ఏఐఎంఐఎం గెలుపు 517471 58.95
Dr Bhagavanth Rao బీజేపీ ఓటమి 235285 26.80
Pusthe Srikanth TRS ఓటమి 63239 7.20
Mohammed Feroz Khan కాంగ్రెస్ ఓటమి 49944 5.69
Nota నోటా ఓటమి 5653 0.64
Dr H Susheel Raj స్వతంత్ర ఓటమి 1715 0.20
Dornala Jaya Prakash NIDP ఓటమి 699 0.08
Sanjay Kumar Shukla స్వతంత్ర ఓటమి 553 0.06
Mohd Ahmed స్వతంత్ర ఓటమి 494 0.06
V Bal Krishna స్వతంత్ర ఓటమి 433 0.05
K Maheshwar స్వతంత్ర ఓటమి 420 0.05
L Ashok Nath స్వతంత్ర ఓటమి 416 0.05
K Nagaraj స్వతంత్ర ఓటమి 414 0.05
K Rangacharya SFB ఓటమి 408 0.05
Beeramganti Venkat Ramesh Naidu స్వతంత్ర ఓటమి 399 0.05
Mohammed Abdul Azeem స్వతంత్ర ఓటమి 329 0.04

ఎన్నికల వార్తలు 2024

ఎన్నికల వీడియో