తెలంగాణ లోక్‌ సభ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు - Telangana Lok Sabha Election Constituencies wise Result

తెలంగాణ రాష్ట్రం దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన రాష్ట్రాలలో ఒకటి. భారత దేశంలో ఇది 28వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. ప్రజల ఆకాంక్షల మేరకు దశాబ్ధాల ఉద్యమాల అనంతరం 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యింది. తెలంగాణ రాష్ట్రపు వైశాల్యం 1,14,840 చ.కి.మీ. విస్తీర్ణపరంగా దేశంలో తెలంగాణ 12వ స్థానంలో ఉంది. కాగా 2011 లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 35,286,757గా ఉంది. జనాభా పరంగానూ తెలంగాణ రాష్ట్రం దేశంలో 12వ స్థానంలో నిలుస్తోంది. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలు, 119 శాసనసభ స్థానాలు ఉన్నాయి. 

తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెండు పర్యాయాలు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్.. 2023 నవంబరులో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యింది. ఈ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. 

తెలంగాణ రాష్ట్రంలో అక్షరాస్యత 66.46 శాతంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తెలుగు, ఉర్దూ అధికార భాషలుగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా ఉంది.

తెలంగాణ లోక్‌సభ స్థానాల జాబితా

రాష్ట్రం సీటు అభ్యర్థి పేరు ఓటు పార్టీ స్థితి
Telangana Hyderabad ASADUDDIN OWAISI 661981 AIMIM Won
Telangana Karimnagar BANDI SANJAY KUMAR 585116 BJP Won
Telangana Nizamabad ARVIND DHARMAPURI 592318 BJP Won
Telangana Malkajgiri EATALA RAJENDER 991042 BJP Won
Telangana Nalgonda RAGHUVIR KUNDURU 784337 INC Won
Telangana Khammam RAMASAHAYAM RAGHURAM REDDY 766929 INC Won
Telangana Bhongir CHAMALA KIRAN KUMAR REDDY 629143 INC Won
Telangana Warangal KADIYAM KAVYA 581294 INC Won
Telangana Secunderabad G KISHAN REDDY 473012 BJP Won
Telangana Chevella KONDA VISHWESHWAR REDDY 809882 BJP Won
Telangana Peddapalle VAMSI KRISHNA GADDAM 475587 INC Won
Telangana Mahabubabad BALRAM NAIK PORIKA 612774 INC Won
Telangana Nagarkurnool DR.MALLU RAVI 465072 INC Won
Telangana Zahirabad SURESH KUMAR SHETKAR 528418 INC Won
Telangana Medak MADHAVANENI RAGHUNANDAN RAO 471217 BJP Won
Telangana Adilabad GODAM NAGESH 568168 BJP Won
Telangana Mahbubnagar ARUNA. D. K 510747 BJP Won

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. దక్షిణ భారతావనిలోని కీలక రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి.  2019 సార్వత్రిక ఎన్నికల్లో మొదటి దఫాలో 11 ఏప్రిల్ తేదీన తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. నాటి ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 లోక్‌సభ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. 2014నాటి ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్ బలం రెండు తగ్గింది. కాగా 2019 ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో 4 స్థానాలు గెలుచుకుంది. ఆ పార్టీ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు లోక్‌సభ సభ్యులుగా గెలిచారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు గెలిచారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు స్థానాలు మాత్రమే గెలుచుకుంది.  అలాగే 2019 ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ గెలుపొందారు. 

ప్రశ్న - 2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఏ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చాయి?

సమాధానం - బీఆర్ఎస్

ప్రశ్న - 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్ని లోక్‌సభ స్థానాలు గెలుచుకుంది?

సమాధానం - బీఆర్ఎస్ 11 సీట్లు గెలుచుకుంది.

ప్రశ్న - 2011తో పోలిస్తే 2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సీట్లు ఎన్ని పెరిగాయి?

సమాధానం: 2014లో బీజేపీ ఒకే స్థానం గెలుచుకోగా.. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ 4 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. అంటే మునుపటి కంటే మూడు స్థానాలు అదనంగా గెలుచుకుంది. 

ప్రశ్న - 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని శాతం ఓట్లు వచ్చాయి?

సమాధానం - 41.71%

ప్రశ్న - 2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి ఎన్ని శాతం ఓట్లు వచ్చాయి?

సమాధానం - 19.65%

ప్రశ్న - 2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని శాతం ఓట్లు వచ్చాయి?

సమాధానం - 29.79%

ప్రశ్న - 2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో నమోదైన పోలింగ్ శాతం ఎంత?

సమాధానం - 62.77%