మల్కాజిగిరి లోక్‌సభ స్థానం (Malkajgiri Lok Sabha Constituency)

మల్కాజిగిరి లోక్‌సభ స్థానం (Malkajgiri Lok Sabha Constituency)

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలున్నాయి. అందులో కీలకమైన పార్లమెంట్ నియోజకవర్గాల్లో మల్కాజిగిరి ఒకటి. ఇక ఓటర్ల పరంగా చూస్తే దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ స్థానంగా గుర్తింపు పొందింది. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో దాదాపు 32 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి రేవంత్‌రెడ్డి బరిలో నిలిచి విజయం సాధించారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఈ లోక్ సభ నియోజకవర్గం మొట్టమొదటిసారిగా 2008లో ఏర్పాటైంది. పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటైన తొలినాళ్లలోనే 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన సర్వే సత్యనారాయణ పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు.

 

2014లో టీడీపీ నుంచి మల్లారెడ్డి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. ఈ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ రెండుసార్లు, తెలుగుదేశం పార్టీ ఒకసారి గెలిచాయి. మల్కాజిగిరి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోకి వస్తుంది. సికింద్రాబాద్ కేంద్రంగా ఉంటుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుండి మల్కాజిగిరి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1965కు ముందు మల్కాజిగిరి గ్రామ పంచాయతీగా ఉండేది. 1985లో మున్సిపల్ కార్పొరేషన్‌గా అవతరించింది. నగర విస్తీర్ణం పెరుగుతూ పోవడంతో 2007లో మళ్లీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేశారు.

అభ్యర్థి పేరు ఫలితాలు మొత్తం ఓట్లు ఓట్ల శాతం %
Anumula Revanth Reddy కాంగ్రెస్ గెలుపు 603748 38.63
Rajashekar Reddy Marri TRS ఓటమి 592829 37.93
Ramchander Rao Naraparaju బీజేపీ ఓటమి 304282 19.47
Mahender Reddy Bongunoori JNP ఓటమి 28420 1.82
Nota నోటా ఓటమి 17895 1.14
Thirupataiah Enduram స్వతంత్ర ఓటమి 3750 0.24
Donthula Bikshapathi స్వతంత్ర ఓటమి 3308 0.21
Rajender Ponnala స్వతంత్ర ఓటమి 2680 0.17
Sai Kiran Gone స్వతంత్ర ఓటమి 1664 0.11
Chamakura Rajaiah SJPI ఓటమి 1351 0.09
Balamani Buru IPBP ఓటమి 1236 0.08
Chalika Chandra Sekhar స్వతంత్ర ఓటమి 1180 0.08
Dharmasanam Bhanumurthy PSTP ఓటమి 720 0.05

ఎన్నికల వార్తలు 2024

ఎన్నికల వీడియో