కరీంనగర్‌ లోక్‌సభ స్థానం - Karimnagar Lok Sabha Constituency

కరీంనగర్‌ లోక్‌సభ స్థానం - Karimnagar Lok Sabha Constituency

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలున్నాయి. అందులో కీలకమైన పార్లమెంట్ నియోజకవర్గాల్లో కరీంనగర్ ఒకటి. ఇక ఓటర్ల పరంగా చూస్తే ఈ లోక్‌సభ నియోజకవర్గంలో దాదాపు 17 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో పురుష ఓటర్ల సంఖ్య 5,58,800 కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 5,88,108. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. అవి కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మాన్కొండూరు, హుజూరాబాద్, హుస్నాబాద్ అసెంబ్లీ స్థానాలు కలిపి కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి.

 

2019 ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి బండి సంజయ్ బరిలో నిలిచి విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి బరిలో దిగిన వినోద్ కుమార్ ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ పోటీ చేసి ఓటమి చవిచూశారు. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. 2014లో బీఆర్ఎస్ నుంచి బి. వినోద్ పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. ఈ నియోజకవర్గం ప్రారంభంలో కాంగ్రెస్ తీవ్రమైన ప్రభావం చూపింది. ఆ తరువాత తెలుగుదేశం, బీఆర్ఎస్, బీజేపీలు వరుసగా గెలుస్తూ వస్తున్నాయి. 2024లో బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ కి టికెట్ కేటాయించింది బీజేపీ అధిష్ఠానం. ఈసారి కూడా బీఆర్ఎస్, బీజేపీ మధ్య బలమైన పోటీ ఉంటుంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు తలపిస్తోంది

అభ్యర్థి పేరు ఫలితాలు మొత్తం ఓట్లు ఓట్ల శాతం %
Bandi Sanjay Kumar బీజేపీ గెలుపు 498276 43.42
Boianapalli Vinod Kumar TRS ఓటమి 408768 35.62
Ponnam Prabhaker కాంగ్రెస్ ఓటమి 179258 15.62
Durvasa Reddy Pakala స్వతంత్ర ఓటమి 11637 1.01
Venkanna Anagandula బీఎస్పీ ఓటమి 9764 0.85
Nota నోటా ఓటమి 7979 0.70
Rameshbabu Shanigarapu స్వతంత్ర ఓటమి 7826 0.68
Pabba Bhanu Laxman స్వతంత్ర ఓటమి 6385 0.56
Mukkisa Rathnakar Reddy స్వతంత్ర ఓటమి 5851 0.51
Chiliveru Srikanth స్వతంత్ర ఓటమి 3470 0.30
Gangarapu Thirupathi స్వతంత్ర ఓటమి 1814 0.16
Aila Prasanna ACDP ఓటమి 1459 0.13
Kota Shyamkumar స్వతంత్ర ఓటమి 1454 0.13
Reddy Venugopal SFB ఓటమి 1431 0.12
Anil Kumar Chintha PPOI ఓటమి 1269 0.11
Palle Prashanth JSWP ఓటమి 1056 0.09

ఎన్నికల వార్తలు 2024

ఎన్నికల వీడియో