అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల ఫలితాలు 2024 ఎన్నికల ఫలితాల వార్తలు
అసదుద్దీన్ ఒవైసీ జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన రాజకీయ నాయుడు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రాజకీయ కుటుంబంలో 1969 మే 13న అసదుద్దీన్ జన్మించారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. నిజాం కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, లండన్‌లోని లింకన్స్ ఇన్ కాలేజీలో బారిస్టర్ చదువుకున్నారు. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీగా గత నాలుగుసార్లు అసదుద్దీన్ ఒవైసీ ఆయన ప్రాతినిథ్యంవహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఎంఐఎం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. మరోసారి అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవనున్నారు. హైదరాబాద్ ఎంపీ కాకముందు అసదుద్దీన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సభ్యుడిగానూ ఉన్నారు.
1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ ఛార్మినార్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 నుంచి హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి అసదుద్దీన్ ప్రాతినిథ్యంవహిస్తున్నారు. 2004, 2009,2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో అసద్ విజయం సాధించారు. రాయల్ ఇస్లామిక్ స్ట్రాటజిక్ స్టడీస్ సెంటర్(ఆర్ఐఎస్ఎస్‌సీ) ప్రతియేటా విడుదల చేస్తున్న ప్రపంచంలోని 500 మంది అత్యంత ప్రభావశీల ముస్లీంల జాబితాలో అసదుద్దీన్ ఒవైసీ కూడా చోటు దక్కించుకుంటున్నారు. భారత్‌లో ముస్లీంల తరఫు గళాన్ని బలంగా వినిపిస్తున్న వారిలో ఒకరుగా అసదుద్దీన్ ఒవైసీ ఉన్నారు.