ఆంధ్రప్రదేశ్ లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల ఫలితాలు - Andhra Pradesh Lok Sabha Candidates Election Result

ఆంధ్ర ప్రదేశ్‌లో జమిలి ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. అధికార వైసీపీని, టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ఢీకొంటోంది. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఒకే విడతలో జమిలి ఎన్నికలను మే 13న నిర్వహించనున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏపీలోని 25 నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గాలు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది. అమలాపురం, బాపట్ల, తిరుపతి, చిత్తూరు నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వ్ చేయగా...అరుకు ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది. ఏపీలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెలువడనుంది. 

ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల జాబితా 2024

రాష్ట్రం సీటు అభ్యర్థి పేరు ఓటు పార్టీ స్థితి
Andhra Pradesh రాజంపేట P V Midhun Reddy 644844 YSRCP Won

2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 22 స్థానాలు, టీడీపీ 3 స్థానాల్లో విజయం సాధించింది. వైఎస్సార్ సీపీకి 49.89 శాతం ఓట్లు పోల్ కాగా.. టీడీపీకి 40.19 శాతం, జనసేనకు 5.87 శాతం ఓట్లు దక్కాయి. 2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  25 స్థానాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులను బరిలో దించనుంది. ఎన్డీయే కూటమి నుంచి తెలుగు దేశం పార్టీ (టీడీపీ) 17 స్థానాలు, బీజేపీ 6 స్థానాలు, జనసేన 2 స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. వైఎస్సార్ సీపీ నుంచి విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నందిగం సురేష్, పి అనిల్ కుమార్ యాదవ్, కేశినేని నాని, రాపాక వర ప్రసాదరావు, బొత్సా ఝాన్సీ లక్ష్మి తదితరులు పోటీ చేయనున్నారు. టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, లావు శ్రీకృష్ణ దేవరాయులు, బీజేపీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కొత్తపల్లి గీత తదితరులు పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిల కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే అవకాశముంది. 

ప్రశ్న: - ఆంధ్ర ప్రదేశ్‌లోని మొత్తం లోక్‌సభ నియోజకవర్గాలు ఎన్ని?

సమాధానం:- ఆంధ్ర ప్రదేశ్‌లో మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి

ప్రశ్న:- ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రిజర్వ్ చేయబడ్డాయి?

సమాధానం:- ఏపీలో 4 లోక్‌సభ నియోజకవర్గాలు ఎస్సీలకు, 1 నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది

ప్రశ్న: - ఆంధ్ర ప్రదేశ్‌లోని లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్ని విడతల్లో ఎన్నికలు జరుగుతాయి?

సమాధానం: - ఏపీలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలు, 175 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది

ప్రశ్న: - ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది?

సమాధానం: ఎన్డీయే కూటమిలో భాగంగా ఏపీలోని 6 లోక్‌సభ నియోజకవర్గాల నుంచి బీజేపీ పోటీ చేస్తోంది. 

ప్రశ్న:- 2019 ఎన్నికల్లో ఏపీలో ఏయే పార్టీ ఎన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో గెలిచాయి?

సమాధానం:- 2019 ఎన్నికల్లో ఏపీలోని 22 లోక్‌సభ స్థానాల్లో వైసీపీ, 3 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు

ప్రశ్న:- 2019 ఎన్నికల్లో వైసీపీకి దక్కిన ఓటింగ్ శాతం ఎంత?

సమాధానం:- వైసీపీకి 49.89% పోలింగ్ దక్కింది.

ఎన్నికల వీడియో