తెలంగాణ లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల ఫలితాలు - Telangana Lok Sabha Candidates Election Result
తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 3 షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), 2 షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ)కు రిజర్వ్ చేయబడింది. ఓటర్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు తద్వారా తమ లోక్‌సభ నియోజకవర్గ ప్రతినిధిని ఎన్నుకుంటారు. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు మొత్తం ఏడు విడతల్లో కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనుంది. ఏడు దఫాల ఎన్నికల ప్రక్రియ 44 రోజుల పాటు సాగనుంది. ఇందులో భాగంగా నాలుగో విడతలో మే 13న తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఒకే దఫాలో పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనుంది. 2019 ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక సగటు అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రం నుంచి బరిలో నిలిచారు. ప్రధానంగా నిజామాబాద్ నియోజకవర్గం నుంచి 185 మంది అభ్యర్థులు పోటీచేశారు. నిజామాబాద్ మినహా రాష్ట్ర సగటు అభ్యర్థుల సంఖ్య 16.1గా ఉంది. తెలంగాణ తర్వాత తమిళనాడులో గత ఎన్నికల్లో అత్యధిక సగటున అభ్యర్థులు పోటీచేశారు.
తెలంగాణ అభ్యర్థుల జాబితా 2024
రాష్ట్రం | సీటు | అభ్యర్థి పేరు | ఓటు | పార్టీ | స్థితి |
---|---|---|---|---|---|
Telangana | మల్కాజిగిరి | Eatala Rajender | 991042 | BJP | Won |
Telangana | కరీంనగర్ | Bandi Sanjay Kumar | 585116 | BJP | Won |
Telangana | ఖమ్మం | Nama Nageswr Rao | - | BRS | Lost |
Telangana | సికింద్రాబాద్ | G Kishan Reddy | 473012 | BJP | Won |
Telangana | హైదరాబాద్ | Asaduddin Owaisi | 661981 | AIMIM | Won |
తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగే ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు.. లోక్‌సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేస్తున్నారు. అటు బీజేపీ సైతం డబుల్ డిజిట్ స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. బీఆర్ఎస్ సైతం అసెంబ్లీ ఎన్నికల పరాభవాన్ని అధిగమించి.. లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని పట్టుదలగా ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం 1 స్థానాల్లో విజయం సాధించాయి.
ప్రశ్న:- తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏ తేదీన పోలింగ్ జరగనుంది?
సమాధానం:- నాలుగో విడతలో మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు
ప్రశ్న:- తెలంగాణలో ఎన్ని నియోజకవర్గాలు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది?
సమాధానం:- తెలంగాణలో 5 లోక్‌సభ నియోజకవర్గాలు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డాయి. వీటిలో 3 ఎస్సీలకు, 2 ఎస్టీలకు రిజర్వ్ చేశారు.
ప్రశ్న:- 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో ఏయే పార్టీల అభ్యర్థులు ఎన్ని స్థానాల్లో గెలిచారు?
సమాధానం:- బీఆర్ఎస్ 9, బీజేపీ 4, బీజేపీ 3, ఎంఐఎం 1 స్థానంలో గెలిచాయి
ప్రశ్న:- 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో నమోదైన పోలింగ్ శాతం ఎంత?
సమాధానం:- తెలంగాణలోని 17 నియోజకవర్గాల్లో సరాసరి 62.77 శాతం పోలింగ్ నమోదయ్యింది.
ప్రశ్న:-2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక మెజార్టీతో గెలిచింది ఎవరు?
సమాధానం:- వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 3,50,298 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ప్రశ్న:- 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అత్యల్ప మెజార్టీతో గెలిచింది ఎవరు?
సమాధానం:- భువనగిరి లోక్‌సభ నియోకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అత్యల్పంగా 5,119 ఓట్ల మెజార్టీతో గెలిచారు.