ఈటెల రాజేందర్ ఎన్నికల ఫలితాలు 2024 ఎన్నికల ఫలితాల వార్తలు

ఈటెల రాజేందర్ ఎన్నికల ఫలితాలు 2024
మల్కాజిగిరి BJPBJP
Won 991042

ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వం (బీఆర్ఎస్)లో ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఆయన.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ శాసనసభ్యుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఆవిర్భావం నుంచి ఆయన ఆ పార్టీలో ఉన్నారు. 2004 ఎన్నికల్లో కమలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 2008 ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కమలాపూర్ నియోజకవర్గం హుజూరాబాద్‌గా మారగా.. అక్కడి నుంచి 2009 ఎన్నికలు, 2010 ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ గెలుపొందారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించి కేసీఆర్ కేబినెట్‌లో ఆర్థిక మంత్రి అయ్యారు. 2018 ఎన్నికల్లోనూ గెలుపొందిన ఈటెల రాజేందర్, 2019లో మరోసారి కేసీఆర్ కేబినెట్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయ్యారు. భూ కబ్జా ఆరోపణలతో 2021 మే1న నాటి సీఎం కేసీఆర్ తన కేబినెట్ నుంచి ఈటెల రాజేందర్‌ను బర్తరఫ్ చేశారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటెల రాజేందర్.. 2021 జూన్ 4న బీజేపీలో చేరారు. 2021 అక్టోబర్ 30న జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి 23, 855 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే 2023 శాసనసభ ఎన్నికల్లో హుజురాబాద్ నుండి బీజేపీ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేసిన ఈటెల రాజేందర్.. తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేతిలో 16,873 ఓట్ల తేడాతో ఓడిపోయాడు

పేరుEatala Rajender వయస్సు60 Years లింగం Male లోక్ సభ సీటుమల్కాజిగిరి
క్రిమినల్ కేసులుYes (45) మొత్తం ఆస్తులు ₹ 54Crore మొత్తం అప్పులు₹ 20.4Crore అర్హతలుGraduate
All the information available on this page has been provided by Association for Democratic Reforms (ADR) | MyNeta and sourced from election affidavits available in the public domain of Election Commission of India ADRMy Neta