పోస్టాఫీసుల దగ్గర తెల్లవారుజాము నుంచే లైన్లు కట్టిన జనం

భాగ్యనగరంలోని పోస్టాఫీసుల దగ్గర జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ రద్దీ కొనసాగుతోంది. సోమవారం కావడంతో ఈ తెల్లవారుజామునుంచే పోస్టాఫీసుల దగ్గర జనం లైన్లు కట్టారు. జీరో అకౌంట్స్ ఓపెన్ చేస్తే ప్రభుత్వం డబ్బు వేస్తుందనే ప్రచారంతో పోస్టాఫీసుల దగ్గర జనం భారీగా బారులు తీరుతున్నారు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి. పనులు మానేసి మరీ పోస్ట్ ఆఫీస్ వద్ద జనం పడిగాపులు కాస్తున్నారు. జీరో అకౌంట్స్ లో ప్రభుత్వం డబ్బు వేస్తుందనే ప్రచారం వారంరోజులుగా […]

పోస్టాఫీసుల దగ్గర తెల్లవారుజాము నుంచే లైన్లు కట్టిన జనం
Follow us

|

Updated on: Oct 12, 2020 | 8:13 AM

భాగ్యనగరంలోని పోస్టాఫీసుల దగ్గర జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ రద్దీ కొనసాగుతోంది. సోమవారం కావడంతో ఈ తెల్లవారుజామునుంచే పోస్టాఫీసుల దగ్గర జనం లైన్లు కట్టారు. జీరో అకౌంట్స్ ఓపెన్ చేస్తే ప్రభుత్వం డబ్బు వేస్తుందనే ప్రచారంతో పోస్టాఫీసుల దగ్గర జనం భారీగా బారులు తీరుతున్నారు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి. పనులు మానేసి మరీ పోస్ట్ ఆఫీస్ వద్ద జనం పడిగాపులు కాస్తున్నారు. జీరో అకౌంట్స్ లో ప్రభుత్వం డబ్బు వేస్తుందనే ప్రచారం వారంరోజులుగా ఊపందుకోవడంతో నగరంలోని పోస్టాఫీసులు కిక్కిరిసిపోతున్నాయి. కరోనాకాలంలో సోషల్ డిస్టెన్స్ లేదంటూ మరోవైపు పోస్టాఫీసు వర్గాల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సికింద్రాబాద్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఉదయం 6 గంటలకే సుమారు 500 మందికి పైగా జనం క్యూలైన్లలో నిల్చోవడం విశేషం.