మోదీ అబద్దాల సినిమా చూడలేం: కాంగ్రెస్ నేత కపిల్ సిబల్

అసలు సినిమా ముందుంది అని వ్యాఖ్యానించిన ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. రెండోసారి పరిపాలన చేపట్టి వందరోజులు పూర్తయిన సందర్భంగా ప్రధాని పలు వ్యాఖ్యలు చేశారు. ఇది ట్రైలర్ మాత్రమేనని, అసలైన సినిమా ముందుంది అన్నారు. ఎన్నికలకు ముందు మరింత బలమైన, పనిచేసే ప్రభుత్వాన్ని అందిస్తామని హామీ ఇచ్చామని.. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని అధికారాన్ని చేపట్టిన 100 రోజుల్లోనే ఎంతో సాధించామని, గత ఐదేళ్లకంటే మరింత వేగంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధాని […]

మోదీ అబద్దాల సినిమా చూడలేం: కాంగ్రెస్ నేత కపిల్ సిబల్
Follow us

| Edited By:

Updated on: Sep 13, 2019 | 3:08 PM

అసలు సినిమా ముందుంది అని వ్యాఖ్యానించిన ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. రెండోసారి పరిపాలన చేపట్టి వందరోజులు పూర్తయిన సందర్భంగా ప్రధాని పలు వ్యాఖ్యలు చేశారు. ఇది ట్రైలర్ మాత్రమేనని, అసలైన సినిమా ముందుంది అన్నారు. ఎన్నికలకు ముందు మరింత బలమైన, పనిచేసే ప్రభుత్వాన్ని అందిస్తామని హామీ ఇచ్చామని.. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని అధికారాన్ని చేపట్టిన 100 రోజుల్లోనే ఎంతో సాధించామని, గత ఐదేళ్లకంటే మరింత వేగంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధాని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ ఘాటుగా స్పందించారు. మోడీ అనుసరిస్తున్న విధానాలతో దేశ ఆర్ధిక వ్యవస్థ పతనమైందని, ఇప్పటికే ఆటోమొబైల్స్ అమ్మకాలు పడిపోయాయన్నారు. దేశం మొత్తం ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటోందన్నారు సిబల్. అబద్దాలతో కూడిన సినిమాను చూడదల్చుకోలేదంటూ ఆయన ఎద్దేవా చేశారు.

మోదీ 100 రోజుల పాలన అనే ట్రైలర్‌లో దేశ స్ధూల జాతీయోత్పత్తి (జీడీపీ) 5శాతానికి పడిపోయిందని, ఆటోమొబైల్స్ అమ్మకాలు,జీఎస్టీ కలెక్షన్స్, పెట్టుబడులు తగ్గిపోయాయంటూ సిబల్ ఆరోపించారు. దేశంలో ఈ వందరోజల్లో నిరుద్యోగం 8.2 శాతం పెరిగిందని ఆయన తెలిపారు.