బంజారాహిల్స్‌ రోడ్డుపై దారుణం… పసిపాపను పీక్కుతున్న కుక్కలు

హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నాలుగు నెలలు కూడా నిండని ఓ చిన్నారిని రోడ్డు మీద వదిలేసి వెళ్లారు గుర్తుతెలియని వ్యక్తులు. దీంతో ఆ పసిపాపపై వీధి కుక్కలు దాడి చేసి.. పీక్కు తిన్నాయి. ఈ ఘటన బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 13లో చోటుచేసుకుంది. అర్ధరాత్రి పూట పెద్ద ఎత్తున కుక్కలు అరవ సాగడంతో.. ఏం అయ్యిందో అని అలీ గగ్గార్ అనే ఓ వ్యక్తి ఇంట్లో నుంచి బయటకువచ్చి చూశాడు. అయితే రోడ్డుపై అక్కడే […]

బంజారాహిల్స్‌ రోడ్డుపై దారుణం... పసిపాపను పీక్కుతున్న కుక్కలు
Follow us

| Edited By:

Updated on: Sep 30, 2019 | 2:07 PM

హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నాలుగు నెలలు కూడా నిండని ఓ చిన్నారిని రోడ్డు మీద వదిలేసి వెళ్లారు గుర్తుతెలియని వ్యక్తులు. దీంతో ఆ పసిపాపపై వీధి కుక్కలు దాడి చేసి.. పీక్కు తిన్నాయి. ఈ ఘటన బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 13లో చోటుచేసుకుంది. అర్ధరాత్రి పూట పెద్ద ఎత్తున కుక్కలు అరవ సాగడంతో.. ఏం అయ్యిందో అని అలీ గగ్గార్ అనే ఓ వ్యక్తి ఇంట్లో నుంచి బయటకువచ్చి చూశాడు. అయితే రోడ్డుపై అక్కడే ఓ చిన్నారి కేకలు కూడా విని. వెళ్లి చూసే సరికి.. ఆ వీధికుక్కలు చిన్నారిని పీక్కుతింటున్నాయి. దీంతో వెంటనే ఆ కుక్కల్ని తరిమేసి.. పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఆ పసిపాను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే ఆ చిన్నారి ప్రాణాలు వదిలేసింది. దీంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ చిన్నారి ఎవరనే విషయమై దర్యాప్తు చేపడుతున్నారు. సీసీ పుటేజీలను పరిశీలించి ఈ దారుణానికి ఒడిగట్టినవారిని గుర్తిస్తామన్నారు.