Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం 18 లక్షల 55 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 1855746 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 586298 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 1230510 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 38938 దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 52050 కరోనా కేస్ లు, 803 మంది మృతి
  • తెలంగాణ బీజేపీ కార్యాలయానికి కరోనా ఎఫెక్ట్. కార్యాలయాన్ని సోమవారం వరకు మూసి ఉంచాలని నిర్ణయించిన రాష్ట్ర నాయకత్వం. జాతీయ పార్టీ కీలక నేతలు కరోనా బారిన పడటంతో రాష్ట్ర కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించ కూడదని నిర్ణయం.
  • అమరావతి : ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం. 3రాజధాని అంశంపై హైకోర్టు విచారణ. రాజధాని తరలింపుపై స్టే ఇచ్చిన హైకోర్టు. గవర్నర్ గెజిట్ పై స్టే ఇచ్చిన ఏపీ హైకోర్ట్.
  • రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టాలపై స్టేటస్‌ కో విధించిన హైకోర్టు. యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించిన హైకోర్టు. 10 రోజులపాటు స్టేటస్‌ కో ఉత్తర్వులు కొనసాగుతున్న హైకోర్టు. రెండు బిల్లులకు సంబంధించి ఇదివరకే గెజిట్‌ విడుదల. తదుపరి కార్యకలాపాలపై స్టేటస్‌ కో విధించిన హైకోర్టు.
  • అమరావతి: విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు. కొరియాకు చెందిన సీఈఓ, డైరెక్టర్ సహా మొత్తం 12 మందికి కండిషన్ బెయిల్ ఇస్తూ ఆదేశాలు. స్టెరైన్ గ్యాస్ నిల్వ లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని నమోదైన కేసులో వీరిని అరెస్టు చేసిన విశాఖ పోలీసులు.
  • Ccmb డైరెక్టర్ రాకేష్ మిశ్రా . జర్నల్స్ పై ఫార్మాకంపెనీల వత్తిడిపై ట్విట్టర్లో స్పందించిన Ccmb డైరెక్టర్. సైంటిస్టులు, జర్నల్స్ పై వివిధ ఫార్మాకంపెనీలు వత్తిడి చేయడం సరి కాదు. దైవంలా భావించే జర్నల్స్ మీద ఒత్తిడి సిగ్గుచేటు. ఆర్థికంగా బలమైన ఫార్మా కంపెనీలు తమ పరిశోథన పత్రాలను ప్రచురించమని వత్తిడిచేయడం సరైందికాదు . తమ పరిశోధనలను అంగీకరించమని జర్నల్స్ పై వత్తిడి మంచిది కాదు. ది లాన్సేంట్, ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లు వివిధ కంపెనీల వత్తిడిని బయటపెట్టడం ఆందోళన కల్గిస్తోంది.
  • మరో మూడు కార్పొరేట్‌ ఆస్పత్రులకు కోవిడ్ సేవలు కట్...! హైదరాబాద్ లో కరోనా ట్రీట్ మెంట్ చేస్తున్న మరికొన్ని ఆస్పత్రులకు ఆరోగ్య నోటీసులు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై ప్రభుత్వం యాక్షన్ .

ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్.. అప్పుడు వరంగల్.. ఇప్పుడు సైబరాబాద్!

Justice For Disha Cyberabad police Encounter, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్.. అప్పుడు వరంగల్.. ఇప్పుడు సైబరాబాద్!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ దిశ హత్య కేసు నిందితులను షాద్‌నగర్‌లో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. నలుగురు నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో.. పోలీసులు వారిని ఎన్‌కౌంటర్ చేశారు. నిందితులైన మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు.. దిశ మరణించిన ప్రదేశంలోనే మృతి చెందటంతో.. దిశకు సరైన న్యాయం జరిగిందని ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. అటు దిశ తల్లిదండ్రులు కూడా.. నిందితులకు తగిన శిక్ష పడిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వి.. ఆయుధాలు లాక్కునేందుకు నిందితులు ప్రయత్నించిన సమయంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది.

Justice For Disha Cyberabad police Encounter, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్.. అప్పుడు వరంగల్.. ఇప్పుడు సైబరాబాద్!

ఇదిలా ఉంటే సీపీ సజ్జనార్.. గతంలో వరంగల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు ఓ యువతిపై యాసిడ్ అటాక్ జరిగింది. ఇక అప్పట్లో దాడి చేసిన నిందితులను వరంగల్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఎన్‌కౌంటర్ చేశారు.ఇప్పుడు దిశ అత్యాచారం కేసులో కూడా నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. ప్రస్తుతం సజ్జనార్ సైబరాబాద్ సీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా, మహిళలపై దాడులకు పాల్పడితే.. డైరెక్ట్ ఎన్‌కౌంటర్ అని సజ్జనార్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారని చెప్పాలి. అంతేకాకుండా రియల్ పోలీస్ అనిపించుకున్నారు.

Justice For Disha Cyberabad police Encounter, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్.. అప్పుడు వరంగల్.. ఇప్పుడు సైబరాబాద్!

 

వరంగల్ సీన్ చటాన్‌పల్లిలో రిపీట్…

సరిగ్గా పదేళ్ల కిందట 2008 డిసెంబర్ 10న వరంగల్ కిట్స్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు స్వపణిక, ప్రణీతలపై యాసిడ్ దాడి జరిగింది. అప్పట్లో సజ్జనార్ వరంగల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక ఈ యాసిడ్ అటాక్‌లో ముగ్గురు నిందితులైన శాఖమూరి శ్రీనివాస్, బజ్జురి సంజయ్, పోతరాజు హరికృష్ణలను కస్టడీలోకి తీసుకున్న 3 రోజుల అనంతరం వరంగల్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఎన్‌కౌంటర్ చేశారు. వాళ్ళు కూడా సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు కాల్చి చంపారు. అప్పట్లో దేశవ్యాప్తంగా ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు పదేళ్ల తర్వాత డాక్టర్ దిశ హత్యకేసు నిందితులను సైతం ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. ఇక అప్పుడు, ఇప్పుడు ఎన్‌కౌంటర్  క్రెడిట్ ఐపీఎస్ అధికారి విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్దే.. కాగా, సరిగ్గా 10ఏళ్ల తరువాత సేమ్ ఇన్సిడెంట్ రిపీట్ కావడం…. అదీ కూడా రెండూ జరిగినవి డిసెంబర్‌లోనే కావడం గమనార్హం.

Related Tags