మీ బ్లడ్‌ గ్రూపుని బట్టి వీటిని తినండి..

The Blood Type Diet also known as the Blood Group, మీ బ్లడ్‌ గ్రూపుని బట్టి వీటిని తినండి..

ఎవరి శరీరానికి తగినట్లుగా వారి ఆహారపు అలవాట్లు ఉంటాయి. లేదా..వారివారి ఆరోగ్యాన్నిబట్టి వారు తీసుకునే ఆహారం ఉంటుంది. కానీ, వీటన్నింటి కంటే..ముఖ్యంగా మనిషి శరీరంలో ఉండే రక్తం గ్రూపును బట్టి ఆహారాన్ని తీసుకోవాలంటున్నారు వైద్యులు. రక్తంలోనూ వివిధ ర‌కాల గ్రూపులు ఉన్నాయి. కొంద‌రి బ్ల‌డ్ గ్రూపులు అరుదుగా దొరికితే కొందరివి సాధార‌ణ బ్ల‌డ్ గ్రూప్‌లు అయి ఉంటాయి. రక్తంలో ఉండే గ్రూపులను బట్టి, వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో సూచిస్తున్నారు వైద్య నిపుణులు.
‘ఏ’ గ్రూప్‌ :
‘ఏ’ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్నవారు చాలా బలహీనంగా ఉంటారు. దాంతో పాటు వ్యాధి నిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు నిమ్మజాతికి చెందిన పండ్లను ఎక్కువగా తినాలి.  ‘ఏ’ గ్రూప్‌ వారు నాన్‌ వెజ్‌కు దూరంగా ఉండటం మంచిది. బరువు తగ్గాలంటే పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, బీన్స్‌, గింజలు, చిరుధాన్యాలు, చేపలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
‘బీ’ గ్రూప్‌ :
ఈ రకమైన రక్తం ఉన్నవారు ఆకుకూరలు, గుడ్లు, తక్కువ కొలెస్ట్రాల్‌ ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి. ‘బి’ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్నవారు కార్న్‌, టమాటాలు, గింజలు, నువ్వులు తక్కువ మోతాదులో తీసుకోవాలి. ‘బి’ గ్రూప్‌ వాళ్లకు సహజంగా జీవక్రియ తక్కువగా ఉంటుంది. త్వరగా అలసిపోతారు, ఆహారం తీసుకున్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుదల కనిపిస్తుంది. కాబట్టి సమయానికి భోజనం చేయాలి. ఈ గ్రూపు రక్తం ఉన్నవారి శరీరంలో కార్టిసాల్ హార్మోన్లు విడుదలవుతుంటాయి. ఫలితంగా వీరు ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటారు. ఇలాంటి వారు
కొవ్వు, నూనె పదార్థాలు, ఆల్కాహాల్‌ను మానేయాలి.
‘ఏబీ’ గ్రూప్‌ :
వీరి జీర్ణాశయంలో ఆమ్ల రసాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఆమ్ల గుణాలున్న పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలాంటి బ్లడ్ గ్రూప్ ఉన్నవారు యాపిల్ సైడర్ వెనిగర్, మనూకా తేనెను ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు, చేపలు, పాలు వంటివి ఆహారంతో చేర్చుకోవాలి.
‘ఓ’ గ్రూప్‌ :
‘ఓ’ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్నవారికి సహజంగానే జీర్ణాశయ సంబంధ సమస్యలు ఎదురవుతాయి. వీరు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను తీసుకుంటే మంచిది. వాటిలో చేపలు, మాంసం,

కూరగాయలు, గింజలు, బీన్స్‌, ఆకుకూరలు క్రమం తప్పకుండా తీసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *