బాగ్దాదీ మృతిపై ఇంకా సస్పెన్స్.. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏం తేల్చనుంది ?

వాల్డ్ లోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన ఇస్లామిక్ లీడర్ అబూ బకర్ బాగ్దాదీ సిరియాలో జరిగిన యుఎస్ దళాల ఆపరేషన్‌లో మరణించాడని భావిస్తున్నారు. అయితే ఫోరెన్సిక్ టెస్ట్ దీన్ని ఇంకా ధృవీకరించాల్సి ఉందని అమెరికా అంటోంది. సిరియాలోని బషీరా వద్ద యుఎస్ స్పెషల్ మిషన్ అతడ్ని టార్గెట్ చేసిందని, హెలికాఫ్టర్లు, జెట్ విమానాలు, డ్రోన్లతో సామూహికంగా విరుచుక పడిందని వార్తలు వస్తున్నాయి. యూఎస్ సైనిక విమానాల నుంచి జరిగిన కాల్పుల్లో ఇతడితో బాటు మరికొందరు కూడా […]

బాగ్దాదీ  మృతిపై ఇంకా సస్పెన్స్.. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏం తేల్చనుంది ?
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 27, 2019 | 1:04 PM

వాల్డ్ లోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన ఇస్లామిక్ లీడర్ అబూ బకర్ బాగ్దాదీ సిరియాలో జరిగిన యుఎస్ దళాల ఆపరేషన్‌లో మరణించాడని భావిస్తున్నారు. అయితే ఫోరెన్సిక్ టెస్ట్ దీన్ని ఇంకా ధృవీకరించాల్సి ఉందని అమెరికా అంటోంది. సిరియాలోని బషీరా వద్ద యుఎస్ స్పెషల్ మిషన్ అతడ్ని టార్గెట్ చేసిందని, హెలికాఫ్టర్లు, జెట్ విమానాలు, డ్రోన్లతో సామూహికంగా విరుచుక పడిందని వార్తలు వస్తున్నాయి. యూఎస్ సైనిక విమానాల నుంచి జరిగిన కాల్పుల్లో ఇతడితో బాటు మరికొందరు కూడా మరణించారని తెలుస్తోంది. అయితే అమెరికా సైనికుల్లో ఎవరైనా మరణించారా లేక గాయపడ్డారా అన్న విషయం తెలియలేదు. అసలు బాగ్దాదీ దాదాపు అయిదేళ్లుగా ఎవరికీ కనబడలేదు. ఏప్రిల్ లో ఐసిస్ 18 నిముషాల వీడియోను విడుదల చేసింది. అందులో బాగ్దాదీ మాదిరే అదే పోలికలతో గడ్డంతో ఒక వ్యక్తి అసాల్ట్ రైఫిల్ పక్కన పెట్టుకుని టెర్రరిస్టులను ఉద్దేశించి ప్రసంగించారు. శ్రీలంకలో ఈస్టర్ సందర్భంగా బాంబు పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులను ఆ వ్యక్తి ప్రశంసించాడు.

అసలు బాగ్దాదీ జీవించే ఉన్నాడా అన్న విషయం ఏళ్ళ తరబడి ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. అమెరికా డ్రోన్ల దాడుల్లో అతడు మరణించాడని ఒక సందర్భంలో సమాచారం అందింది. అయితే అది నిజం కాదని, సిరియాలోనో, ఇరాక్ లోనో యేవో మారుమూల ప్రాంతాల్లో దాక్కుని ఉండవచ్ఛునని కూడా అంటున్నారు. 2010 నుంచీ బాగ్దాదీ ఐసిస్ నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇతడి ఆచూకీ తెలిపినా, హతమార్చినా అమెరికా 25 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది.

2016 నవంబరులో బాగ్దాదీ తాను చేసిన ఓ పొరబాటుకు దాదాపు మృత్యువు అంచు వరకూ వెళ్ళాడు. ఇరాక్ లోని మోసుల్ లో ఐసిస్ ఉగ్రవాద శిబిరాలపై అమెరికా దళాలు దాడులు జరుపుతున్నప్పుడు సిటీ బయట ఎక్కడో ఉన్న బాగ్దాదీ.. 45 సెకండ్లతో కూడిన రేడియో కాల్ ని తన సహచరులకు ఇచ్చాడు. అయితే ఆ సందేశం అమెరికా ఎలక్ట్రానిక్స్ ఈవ్స్ డ్రాపింగ్ విమాన సిబ్బందికి చేరింది. దాంతో వెంటనే యుఎస్ దళాలు అప్రమత్తమై.. ఆ చోటికి చేరుకునేలోగా తన బాడీగార్డులతో బాగ్దాదీ తప్పించుకున్నాడు. 1971 లో ఇరాక్ లోని సమర్రాలో పుట్టిన ఈ కరడు గట్టిన ఉగ్రవాది.. అసలు పేరు ఇబ్రహీం అవద్ అల్ బద్రి.. ఇరాక్ మాజీ అధ్యక్షుడు దివంగత సద్దాం హుసేన్ హయాంలోని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఉగ్రవాద బృందాలను ఎలా ఆపరేట్ చేయాలో బాగ్దాదీ నేర్చుకున్నాడు. ఇరాక్, సిరియా దేశాల్లో మెల్లగా తన నెట్ వర్క్‌ని విస్తరించాడు.ఇస్లామిక్ విధానాలను నూరిపోస్తూ .. సూసైడ్ బాంబర్లకు శిక్షణ ఇచ్చాడు.

'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు'.. నాగబాబు
'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు'.. నాగబాబు
కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..