ఢిల్లీ పోలీసుల నిర్లక్ష్యం.. ఆగస్టు 15ను ‘రిపబ్లిక్ డే’గా ప్రచురించి..

Delhi Police Mistakes Independence Day For Republic Day Taken To Court, ఢిల్లీ పోలీసుల నిర్లక్ష్యం.. ఆగస్టు 15ను ‘రిపబ్లిక్ డే’గా ప్రచురించి..

ఢిల్లీ: తెల్లవారితే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు దేశం మొత్తం సిద్ధమవుతున్న తరణంలో దక్షిణ ఢిల్లీ పోలీసుల నిర్లక్ష్యం దేశం మొత్తాన్ని నివ్వెరపరుస్తోంది. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవానికి బదులు, రిపబ్లిక్ డేగా ప్రచురించి విమర్శల పాలైంది. దీనిపై ఓ వ్యక్తి కోర్టును కూడా ఆశ్రయించాడు. ఓ జాతీయ వార్తా సంస్ధ కథనం ప్రకారం
ఈ ఆగస్టు 15కు సంబంధించి కొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసిన దక్షిణ దిల్లీ పోలీసు విభాగం, ‘ఇండిపెండెన్స్‌ డే’కు బదులుగా ‘రిపబ్లిక్‌ డే’ అని తప్పుగా ప్రచురించింది.

కింది స్థాయి సిబ్బంది చేసిన తప్పుడు నోటిఫికేషన్లను అధికారులు కూడ గమనించిన వెంటనే వీటిని బయటకు రాకుండా అక్కడే అపేశారు. దీంతో అవి బయటకు రాలేదు. ఇక ఇదే విషయంపై మన్‌జీత్‌ సింగ్‌ చుఘ్‌ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ బుధవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు రానుంది. గతంలో 2016లో కూడా ఇటువంటి వివాదాస్పద ఘటనే చండీగఢ్‌లో జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *