Breaking News
  • పులిగడ్డ-పెనుముడి బ్రిడ్జి పై నుంచి నదిలోకి దూకిన యువతి. పులిగడ్డ-పెనుముడి బ్రిడ్జి పై నుంచి నదిలోకి దూకిన యువతి. వాహనదారుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరిన పోలీసులు. నదిలోకి దూకి యువతిని కాపాడిన ఏఎస్సై మాణిక్యాలరావు. మాణిక్యాలరావును అభినందించిన పోలీసులు, స్థానికులు.
  • చెన్నై: సినీ నటుడు రాఘవ లారెన్స్‌ వివాదాస్పద వ్యాఖ్యలు. డబ్బు కోసమో, పబ్లిసిటీ కోసమో రజినీ రాజకీయాలకు వస్తున్నారని.. కొందరు మాట్లాడటం దురదృష్టకరం-రాఘవ లారెన్స్‌. రజినీకి రాజకీయాలు తెలియదు అనడం హాస్యాస్పదం. రజినీని ఎవరు టార్గెట్‌ చేసినా వాళ్లకు గట్టిగా సమాధానం చెప్తా. త్వరలో రజినీ రాజకీయం ఏంటో అందరూ చూస్తారు-రాఘవ లారెన్స్‌. రజినీ మీద అభిమానంతో కమలహాసన్‌ పోస్టర్లను పేడతో కొట్టి చించేవాణ్ణి. వాళ్లిద్దరు కలవడం ద్వారా తమిళనాడులో మంచి రోజులు రాబోతున్నాయి -సినీ నటుడు రాఘవ లారెన్స్‌.
  • కరీంనగర్‌: కోరుట్లలో వంద పడకల ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన. ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి ఈటెల రాజేందర్‌. వైద్యంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో తెలంగాణ పోటీ పడుతుంది. గతంలో ప్రభుత్వ ఆస్పత్రి అంటే ప్రజలు భయపడేవారు. కేంద్ర పథకం ఆయుష్మాన్‌ పథకం కన్నా ఆరోగ్యశ్రీ మిన్న.
  • విజయవాడ: టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీలు పెంచలేదు. ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలపై రూ.3,500 కోట్ల భారం పడుతుంది. వైసీపీ చేతగాని తనంతోనే ప్రజలపై భారం మోపారు -మాజీ మంత్రి దేవినేని ఉమ. ఐదు నెలలు ఇసుక దొరకకుండా దోచుకున్నారు. ఇప్పుడు ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలపై భారం మోపారు -మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.
  • విజయవాడ: భవానీ దీక్ష విరమణల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ నెల 18 నుంచి 22 వరకు ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణలు. కనకదుర్గానగర్‌ మీదుగా భక్తులను ఆహ్వానిస్తున్నాం. భవానీల కోసం ఘాట్‌ రోడ్డు మీదుగా క్యూలైన్‌లు ఏర్పాటు చేశాం. ఇంద్రకీలాద్రిపై ప్లాస్టిక్‌ను నిషేధించాం-ఈవో సురేష్‌ బాబు.
  • చెన్నై: స్థానిక సంస్థల ఎన్నికలకు రజినీ మక్కల్‌ మండ్రం దూరం. ఏ పార్టీకి మద్దతు ప్రకటించని మండ్రం. రజినీ మద్దతు ఇస్తున్నట్టు ఎవరైనా ప్రచారం చేసుకుంటే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.
  • నెల్లూరు: వైసీపీ ప్రభుత్వం మాట తప్పింది-కోటంరెడ్డి . ప్రజలపై ఏ భారం వేయబోము అని నమ్మించి అధికారంలోకి వచ్చారు. ఆర్టీసీ చార్జీల పెంపుతో ఏటా రూ.700 కోట్ల భారం ప్రజలపై పడింది. మాట తప్పని జగన్‌ ఆర్టీసీ చార్జీల పెంపుపై సమాధానం చెప్పాలి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కాపీ కొడుతూ జగన్‌ కాపీ సీఎంగా మారారు -నూడా మాజీ చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.

రెండురోజుల పాటు.. స్కూళ్లకు సెలవులు.. రీజన్ ఏంటంటే..?

Delhi Air Pollution: Schools In Delhi To Be Closed For Next Two Days Amid High Air Pollution, రెండురోజుల పాటు.. స్కూళ్లకు సెలవులు.. రీజన్ ఏంటంటే..?

కాలుష్య ప్రభావం ఏమో కానీ అక్కడి స్కూల్ పిల్లలు పండగ చేసుకుంటున్నారు. అసలు నిజమైన పండుగలకే సరిగ్గా సెలవులు రాని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో.. ఇప్పుడు ఫెస్టివల్స్ లేకున్నా ఢిల్లీ స్కూల్ విధ్యార్ధులకు సెలవులు వస్తున్నాయి. దీనికి కారణం ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం. గత కొద్దిరోజులుగా దేశరాజధానిలో గాలి నాణ్యత క్షీణిస్తూ వస్తోంది. దీంతో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అయితే ప్రస్తుతం వాయు కాలుష్యం తీవ్రత డేంజర్‌గా మారడంతో.. ప్రజలు బయట తిరిగే పరిస్థితి లేకుండా పోతోంది. ఇక ఈ గాలిని పీలిస్తే చిన్న పిల్లలు రోగాల బారిన పడతారని వైద్యులు తెల్పడంతో.. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. అటు సుప్రీంకోర్టు కూడా పెరుగుతున్న వాయు కాలుష్యంపై సీరియస్‌గానే ఉంది. వీలైనంత త్వరగా వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలపై సీరియస్ అయ్యింది. అంతేకాదు ఢిల్లీలోని పాఠశాలలకు నవంబరు 15 వరకు సెలవులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్యానెల్ ఆదేశించింది. మరోవైపు ఇప్పటికే హాట్ మిక్స్ ప్లాట్స్, స్టోన్ క్రషర్స్‌పై ఉన్న నిషేధాన్ని.. మరో రెండు రోజుల పాటు పొడిగించింది.

ప్రస్తుతం ఢిల్లీ పరిసర ప్రాంతంలో గాలి నాణ్యత మరింత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇప్పటికే ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు సరి- బేసి విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మరోవైపు కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలపై కూడా నిషేధం విధించింది. అంతేకాదు ఇప్పటికే పలుమార్లు పాఠశాలలకు, కాలేజ్‌లకు సెలవులు ప్రకటించింది కూడా. అయితే తాజాగా రెండు రోజులపాటు స్కూల్స్‌కి సెలవులు ప్రకటించింది. అంతేకాదు.. అత్యవసరమైతేనే తప్ప ఢిల్లీ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ సూచనలు జారీ చేసింది. ఢిల్లీతో పాటు NCR పరిధిలోని నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్ నగరాలకు కూడా ఇవి వర్తిస్తాయని తెలిపింది. మొత్తానికి వాయు కాలుష్యంతో విద్యార్ధులకు మాత్రం తరచూ సెలవులు వస్తున్నాయి.