సింధు కామెంట్స్‌కి.. “లవ్ యూ ఛాంప్” అంటూ దీపిక రిప్లై!

Deepika Padukone’s reaction to badminton player P V Sindhu calling her ‘talented and beautiful’ is priceless, సింధు కామెంట్స్‌కి.. “లవ్ యూ ఛాంప్” అంటూ దీపిక రిప్లై!

బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనేముంది. బ్యూటీతో పాటు యాక్టింగ్‌తో మెస్మరైజ్ చెయ్యడం ఆవిడకు ఫస్ట్ నుంచి అలవాటే. మాములు ఫ్యాన్స్ మాత్రమే కాదు..చాలామంది సెలబ్రిటీలు సైతం దీపికాను లైక్ చేస్తారు. అయితే తాజా విషయం ఏంటంటే..?  దీపికాను అభిమానించే లిస్ట్‌లో ఏస్ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు కూడా చేరిపోయారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకున్న తర్వాత ఆమె ఓ ఇంటర్వ్యూలో తనకు మహేష్‌బాబు, ప్రభాస్‌తోపాటు బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణే అంటే ఇష్టమని తెలిపారు. దీపికా టాలెంట్‌తోపాటు అందంగా ఉంటారని సింధు వివరించారు. ఆ ఇంటర్వ్యూ చదివిన దీపికా సోషల్‌మీడియా వేదికగా ఆనందాన్ని వ్యక్తపరిచారు. తన ఇన్‌స్టా స్టోరీలో ఇంటర్వ్యూ ఫొటోను షేర్‌ చేసి ‘లవ్‌ యూ ఛాంప్‌’ అని పేర్కొన్నారు.ప్రస్తుతం దీపికా పదుకొణె ‘ఛాపక్‌’, ’83’ చిత్రాలలో నటిస్తున్నారు. భారత క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణవీర్‌ సింగ్‌ కపిల్‌దేవ్‌ పాత్రలో కనిపించనున్నారు. కపిల్‌ సతీమణి రోమీ భాటియా పాత్రలో దీపికా నటించనున్నారు.

Deepika Padukone’s reaction to badminton player P V Sindhu calling her ‘talented and beautiful’ is priceless, సింధు కామెంట్స్‌కి.. “లవ్ యూ ఛాంప్” అంటూ దీపిక రిప్లై!
Deepika Padukone reacts to PV Sindhu’s comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *