‘ప్రభాస్‌ 21 హీరోయిన్‌’ అని పిలవడంపై దీపికా ఫైర్‌

ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్ తెరకెక్కిస్తోన్న చిత్రంలో హీరోయిన్‌గా దీపికా పదుకొనే నటించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆదివారం అధికారిక ప్రకటన వెలువడింది.

'ప్రభాస్‌ 21 హీరోయిన్‌' అని పిలవడంపై దీపికా ఫైర్‌
Follow us

| Edited By:

Updated on: Jul 20, 2020 | 1:22 PM

ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్ తెరకెక్కిస్తోన్న చిత్రంలో హీరోయిన్‌గా దీపికా పదుకొనే నటించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆదివారం అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమా ద్వారా మొదటి సారి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది దీపికా. ఇక ఈ అవకాశంపై సోషల్ మీడియాలో స్పందించిన ఈ బ్యూటీ.. థ్రిల్లింగ్‌కి మించి ఫీల్ అవుతున్నా. అద్భుతమైన జర్నీ కోసం వెయిట్ చేస్తున్నా అని ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే ప్రభాస్, దీపికా కలిసి నటించే విషయాన్ని రాసుకొచ్చిన ఓ వెబ్‌సైట్‌.. అందులో దీపికాను ‘ప్రభాస్ 21’ హీరోయిన్‌గా సంబోధించింది. అయితే ఇది దీపికాకు ఏ మాత్రం నచ్చలేదు. దీంతో ట్విట్టర్‌లో స్పందించిన ఈ నటి.. ”మీరు రిపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్‌. కానీ ఈ సినిమా టైటిల్‌ ప్రభాస్ 21 కాదు. ప్రభాస్ నటించే 21వ చిత్రం ఇది. ఈ మూవీ హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. దీన్ని నోట్‌ చేసుకోండి” అంటూ కామెంట్ పెట్టారు. కాగా దీపికా ట్వీట్‌పై పలువురు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ నెటిజన్లు.. ”టైటిల్ పెట్టే వరకు దాన్ని ప్రభాస్‌ 21గానే పిలుస్తారని.. పాన్ ఇండియా మూవీ అయినప్పటికీ, మొదట ఇది తెలుగు చిత్రం” అని కామెంట్లు పెడుతున్నారు.