Ongole: ఒంగోలులో దారుణం.. ఎస్ఐ పిలుస్తున్నారంటూ తీసుకెళ్లి అత్యాచారం.. ఆ తర్వాత..

Young Woman Raped In Ongole: ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఎస్సై పిలుస్తున్నాడంటూ ఓ దుండగుడు.. యువతిని తీసుకెళ్లి..

Ongole: ఒంగోలులో దారుణం.. ఎస్ఐ పిలుస్తున్నారంటూ తీసుకెళ్లి అత్యాచారం.. ఆ తర్వాత..
A Man Attempt Rape

Updated on: May 29, 2021 | 7:12 AM

Young Woman Raped In Ongole: ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఎస్సై పిలుస్తున్నాడంటూ ఓ దుండగుడు.. యువతిని తీసుకెళ్లి అత్యచారానికి పాల్పడ్డాడు. మొదట.. స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన ఆ యువతిని నిందితుడు ద్విచక్ర వాహనంపై అనుసరించాడు. ఆ తర్వాత తనకు సంబంధించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని.. ఇంట్లో వాళ్లకి చూపుతానంటూ బెదిరించాడు. తానేమీ తప్పు చేయలేదని ఆమె ధైర్యంగా బదులివ్వడంతో అగంతకుడు ఒక్కసారిగా మాట మార్చాడు. వెంటనే.. ఎస్సై పిలుస్తున్నారు.. స్టేషన్‌కు రావాలంటున్నారని.. తెలిపాడు. ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఆ యువతి.. అతని బండి ఎక్కింది. అనంతరం ఆ దుండగుడు.. యువతిని కొత్త మామిడిపాలెం రోడ్డులోకి తీసుకెళ్లి బెదిరించాడు. అత్యాచారానికి పాల్పడి ఆమెను రూం దగ్గర వదిలేశాడు.

ఈ విషయాన్ని తనతో ఉండే స్నేహితులకు చెప్పి ఆ యువతి కన్నీటి పర్యంతమైంది. దీంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేసేలా ఆమెకు ధైర్యాన్ని కల్పించారు. ఒంగోలులో చోటుచేసుకున్న ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు మేరకు గురువారం రాత్రి దిశ మహిళా పోలీసు స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు గతంలోనూ ఇదే తరహా నేరాలకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Also Read:

Woman Molested: చిత్రహింసలు పెడుతూ కామాంధుల పైశాచికం.. ఆపై సోషల్ మీడియాలో దృశ్యాలు.. వీడియో వైరల్‌గా మారడంతో..

Woman Committed Suicide: పెళ్లి రద్దయిందని యువతి ఆత్మహత్య.. ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని..