Young Lady Suicide: ప్రాణం తీసిన పెళ్లి సంబంధాలు.. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఓ యువతి ఆత్మహత్య

|

May 21, 2021 | 4:45 PM

తనకు ఇష్టం లేని వివాహం చేసేందుకు కుటుంబసభ్యులు సిద్ధం కావడంతో ఓ యువతి ఇంటి బలవన్మరణానికి పాల్పడింది.

Young Lady Suicide: ప్రాణం తీసిన పెళ్లి సంబంధాలు.. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఓ యువతి ఆత్మహత్య
Young Lady Suicide
Follow us on

Young Woman Suicide: తనకు ఇష్టం లేని వివాహం చేసేందుకు కుటుంబసభ్యులు సిద్ధం కావడంతో ఓ యువతి ఇంటి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నచింతకుంట మండలంలోని మద్దూరు గ్రామానికి చెందిన సునీత (20)కు కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే, తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని కొద్దిరోజులుగా ఆగాల్సిందిగా కుటుంబసభ్యులకు చెప్పింది. అయినప్పటికీ తనకు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేకున్నా.. మరో రెండ్రోజుల్లో పెళ్లిచూపులకు వస్తున్నారని తెలిసి మనస్తాపానికి గురైంది. గురువారం ఇంట్లో పురుగు మందు తాగి అపస్మారక స్థితికిలోకి వెళ్లింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటీన వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సునీత మృతి చెందిందని ఎస్సై భాగ్యలక్ష్మీరెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతదేహన్ని పోస్టు మార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.

Read Also…  PM Modi emotional: ప్రియమైనవారిని కోల్పోయాం.. భావోద్వేగానికి లోనైన ప్రధాని నరేంద్రమోదీ