నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని..ఇప్పుడు హత్య చేసి జైలుకెళ్లాడు

Updated on: Aug 01, 2026 | 6:16 PM

విశాఖపట్నంలో జరిగిన సురేష్ హత్య కేసులో, నిందితుడి భార్య కీలక వివరాలు వెల్లడించింది. తన భర్తతో వివాహేతర సంబంధం ఏర్పడిన యువతిని కొట్టి చంపినట్లు, ఆపై సూట్‌కేస్‌లో మృతదేహాన్ని రాయగడలో పడేసినట్లు తెలిపింది. తాను ఇంటికి వచ్చేలోపే ఘటన జరిగిందని, ఆ తర్వాత తెలిసి భయపడినట్లు చెప్పింది. పోలీసులు సురేష్‌ను అరెస్టు చేశారు.

విశాఖపట్నం సురేష్ హత్య కేసులో నిందితుడు సురేష్ భార్య కీలక వివరాలను వెల్లడించారు. తన భర్త ఒక యువతిని హత్య చేసి, మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పడేసినట్లు ఆమె తెలిపారు. నిందితుడి భార్య హాస్పిటల్‌లో ఉన్న సమయంలో సహాయం కోసం ఒక యువతిని సురేష్ ఇంటికి తీసుకువచ్చాడని, ఆ తర్వాత ఆమెతో వివాహేతర సంబంధం ఏర్పడిందని వెల్లడించారు. తాను పాప పుట్టినరోజు వేడుకలకు వెళ్ళిన సమయంలో ఇంట్లో ఈ ఘటన జరిగిందని, తిరిగి వచ్చాక తన భర్త యువతిని కొట్టడంతో అనుకోకుండా చనిపోయిందని చెప్పాడని వివరించారు.అనంతరం భయం కారణంగా పూర్ణా మార్కెట్ నుండి సూట్‌కేస్‌ను కొనుగోలు చేసి, మృతదేహాన్ని అందులో కుక్కి ఒడిస్సాలోని రాయగడ సమీపంలో పడేసినట్లు తన భర్త పోలీసులకు చెప్పాడని భార్య తెలిపారు. ఒడిస్సా పోలీసులు సురేష్‌ను అరెస్టు చేసి తీసుకువెళ్లారని, తన భర్త కావాలని హత్య చేయలేదని, కోపంలో కొట్టగా చనిపోయిందని చెప్పాడని ఆమె వివరించారు. ప్రస్తుతం ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

మరిన్ని వీడియోల కోసం :

టాక్సిక్‌ క్రేజ్‌… ఫస్ట్ ఈవెంటే నెక్స్ట్ లెవల్‌!

ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే

పెళ్లిచూపులకు పదేళ్లు..తనని తాను స్టార్‌గా మలుచుకున్న రౌడీ భాయ్‌

లీస్ట్ బడ్జెట్‌.. రికార్డ్ టైమ్‌..సందీప్‌ స్కెచ్‌..ప్రభాస్‌కు సెట్ అవుతుందా?

Loading...
Unable to load recommendations.
Follow Us