నెత్తురోడిన ఉత్తరప్రదేశ్ రహదారులు.. 9 మంది దుర్మరణం..!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని జాతీయ రహదారులు నెత్తురోడాయి. నాలుగు వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాల్లో 9 మంది ప్రాణాలను వదిలారు. య‌మునా, ఆగ్రా - ల‌క్నో ఎక్స్ ప్రెస్ వేపై వ‌రుస‌గా ఈ నాలుగు రోడ్డుప్ర‌మాదాలు జ‌రిగాయి. మ‌రో 9 మంది తీవ్రంగా గాయ‌పడ్డారు.

నెత్తురోడిన ఉత్తరప్రదేశ్ రహదారులు.. 9 మంది దుర్మరణం..!
Follow us

|

Updated on: Jun 20, 2020 | 6:27 PM

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని జాతీయ రహదారులు నెత్తురోడాయి. నాలుగు వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాల్లో 9 మంది ప్రాణాలను వదిలారు. య‌మునా, ఆగ్రా – ల‌క్నో ఎక్స్ ప్రెస్ వేపై వ‌రుస‌గా ఈ నాలుగు రోడ్డుప్ర‌మాదాలు జ‌రిగాయి. మ‌రో 9 మంది తీవ్రంగా గాయ‌పడి ఆస్పత్రిలో చికిత్స పొంతున్నారు. మ‌ధురలోని య‌మ‌న్ పార్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని య‌మునా ఎక్స్ ప్రెస్ వేపై వేగంగా వెళ్తున్న కారును గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రగాయం గాయపడ్డారు. అటు ఆగ్రా – ల‌క్నో ఎక్స్ ప్రెస్ వేపై ఫిరోజాబాద్ జిల్లాలోని నాసిర్ పూర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలను కోల్పోయారు. వేగంగా వచ్చిన ట్ర‌క్కు కారును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కారులోని ఐదుగురు వ్యక్తులు మృతి చెందగా.. మ‌రో ఇద్ద‌రు తీవ్ర గాయాల‌తో ఆస్పత్రి పాలయ్యారు. ఆగ్రాలోని ఫ‌తేబాద్ సమీపంలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో కారును ట్ర‌క్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక‌రు దుర్మరణం పాలయ్యారు. మెయిన్ పురి జిల్లాలోని కుర్రా పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకున్న మరో ఘటనలో వేగంగా వెళ్తున్న కారు అదుపుత‌ప్పి డివైడ‌ర్ ను ఢీకొట్టి బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు. డ్రైవ‌ర్లంద‌రూ నిద్ర మ‌త్తులో ఉండ‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదాలు సంభ‌వించిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. రోడ్డు ప్రమాదాలపై వేర్వేరుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలకు పంచనామా నిర్వహించి వారి వారి బంధువులకు అప్పగించారు.