Crime: దారుణం.. కుటుంబ కలహాలతో.. తమ్ముడి కుటుంబాన్నే అంతం చేసిన అన్న..

|

May 24, 2021 | 9:21 AM

Uttar Pradesh family murder: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో.. అన్న సొంత తమ్ముడి కుటుంబాన్నే అత్యంత దారుణంగా

Crime: దారుణం.. కుటుంబ కలహాలతో.. తమ్ముడి కుటుంబాన్నే అంతం చేసిన అన్న..
Murder
Follow us on

Uttar Pradesh family murder: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో.. అన్న సొంత తమ్ముడి కుటుంబాన్నే అత్యంత దారుణంగా హతమార్చాడు. సొంత త‌మ్ముడితోపాటు అత‌ని భార్య‌ను చంపి.. ఆపై ఏడాది వ‌య‌సున్న‌ వారి కుమారుడి అవ‌య‌వాల‌ను కోసి కిరాత‌కంగా హ‌త్య‌చేశాడు. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని భ‌దోహి జిల్లాలో చోటుచేసుకుంది. భదోహి జిల్లాలోని క‌జియానాకు చెందిన నౌష‌ద్ మ‌ట‌న్ వ్యాపారిగా జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ క‌ల‌హాల నేప‌థ్యంలో త‌న త‌మ్ముడైన జ‌మీల్ (42) అత‌ని భార్య‌ రూబీ (38) ని మ‌ట‌న్ కోసే క‌త్తితో దాడి చేసి అత్యంత దారుణంగా హతమార్చాడు. అంత‌టితో ఆగ‌కుండా వారి ఏడాది వ‌య‌స్సున్న‌ కుమారుడిని పాశవికంగా హత్యచేశాడు. అవ‌య‌వాల‌ను కోసి చిత్రహింసలకు గురిచేశాడు.

గమనించిన స్థానికులు బాధితులను బ‌దోహీలోని ఆసుపత్రికి త‌ర‌లించ‌గా.. అప్ప‌టికే వారు మ‌ర‌ణించార‌ని వైద్యులు తెలిపారు. కాగా ఈ దారుణ సంఘటన కుటుంబ క‌ల‌హాల‌తోనే జరిగిందని భ‌దోహి ఎస్పీ రామ్ బ‌ద‌న్ సింగ్‌ తెలిపారు. ముందు త‌న త‌మ్ముడు, మ‌ర‌ద‌లను క‌త్తితో నరికి చంపాడని.. ఆ త‌ర్వాత వారి కుమారుడి కాలు, చెయ్యి న‌రికేశాడ‌ని భ‌దోహి ఎస్పీ రామ్ బ‌ద‌న్ సింగ్‌ వివరించారు. హ‌త్య అనంత‌రం నౌష‌ద్ త‌న త‌ల్లితో ప‌రార‌య్యాడ‌ని.. అత‌నికోసం గాలిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Also Read:

Farmers protest: రైతుల ఉద్యమానికి ఆరు నెలలు.. మే 26న బ్లాక్‌డేగా పాటించాలని రైతు సంఘాల పిలుపు

Mask with a Mic Speaker: ఆకట్టుకుంటున్న బీటెక్ విద్యార్థి మాస్క్.. స్పీకర్‌తో డ‌బుల్ మాస్క్ అవిష్కరణ