Ghatkesar Gangrape: అవును… అమ్మాయిని పథకం ప్రకారమే కిడ్నాప్.. ఘట్‌కేసర్‌ కేసులో ఆరుగురు నిందితుల అరెస్ట్

|

Feb 12, 2021 | 12:12 PM

Gangrape Case : రెడీ వేసుకున్న స్కెచ్ ప్రకారమే... నిందితులు ఫార్మసీ విద్యార్థినిని రేప్ చేశారు. విషయం బయటకు పొక్కకుండా ఆమెను హత్య చేయాలనీ భావించారు. పోలీసు వాహనాల సైరన్ల మోతతో వెనకడుగు వేశారు.

Ghatkesar Gangrape: అవును... అమ్మాయిని పథకం ప్రకారమే కిడ్నాప్.. ఘట్‌కేసర్‌ కేసులో ఆరుగురు నిందితుల అరెస్ట్
Follow us on

Ghatkesar Gangrape Case : అవును… అమ్మాయిని పథకం ప్రకారమే కిడ్నాప్ చేశారు… బలత్కరించారు… నెక్స్ట్‌ హత్య చేయడమే… ఇంతలో పోలీసుల రాకతో కథ అడ్డం తిరిగింది. ఫార్మసీ విద్యార్థి హత్య కేసులో డీప్‌ ఎంక్వయిరీ చేస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. వాళ్ల వికృత రూపం ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది.

ముందుగా రెడీ వేసుకున్న స్కెచ్ ప్రకారమే… నిందితులు ఫార్మసీ విద్యార్థినిని రేప్ చేశారు. విషయం బయటకు పొక్కకుండా ఆమెను హత్య చేయాలనీ భావించారు. పోలీసు వాహనాల సైరన్ల మోతతో వెనకడుగు వేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నలుగురు ఆటో డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్లంతా ముఠాగా ఏర్పడి అఘాయిత్యాలకు పాల్పడేవారని, మరికొందర్నీ అత్యాచారం చేశారని విచారణలో తేలినట్టు తెలిసింది. కేసు వివరాలను రాచకొండ పోలీసులు ఇవాళ వెల్లడించే అవకాశముంది.

బాధిత విద్యార్థిని మేడ్చల్‌కు సమీపంలోని ఓ కళాశాలలో బీ-ఫార్మసీ చదువుతోంది. రోజూ కీసర మండలం రాంపల్లి చౌరస్తా వద్ద కళాశాల బస్సు దిగుతున్న యువతి అక్కణ్నుంచి సుమారు 1.5 కి.మీ దూరంలో ఉన్న ఇంటికి ఆటోలో వెళ్లేది. ప్రధాన నిందితుడు సెవెన్‌ సీటర్‌ ఆటోలే చాలాసార్లు ప్రయాణించింది. అప్పుడే ఆ దుర్మార్గుడు ఆమెపై కన్నేశాడు. సహచరులతో కలిసి కిడ్నాప్‌ ప్లాన్ వేశాడు.

బుధవారం సాయంత్రం 5.30 గంటల నుంచి 5.45 గంటల మధ్య రాంపల్లి చౌరస్తా దగ్గర కళాశాల బస్సు దిగి ఆటో అడ్డా వద్దకు వచ్చింది యువతి. అక్కడే ఉన్న ప్రధాన నిందితుడు… ముగ్గురు స్నేహితులకు ఫోన్‌చేసి ‘మ్యాటర్‌ రెడీగా ఉందంటూ’ మెసేజ్‌ పంపించాడు. ఆ ఆటోలో అప్పటికే ఇద్దరు మహిళలు, యువకుడు ఉండటంతో ధైర్యంగా ఎక్కింది. కొద్ది దూరం వెళ్లేసరికి వాళ్లు దిగారు. తర్వాత ఆటోలో ఒక్కామె ఉంది. యువతి దిగాల్సిన బస్‌స్టాప్‌ వచ్చినా నిందితుడు ఆటో ఆపకుండా వేగంగా యంనంపేటవైపు పోనిచ్చాడు. అప్పుడే తల్లికి ఫోన్ చేసి… కిడ్నాప్ చేస్తున్నారని చెప్పింది. తర్వాత డయల్‌ 100కు సమాచారం అందడంతో విషయం పోలీసులకు చేరింది.

ఆటో యంనంపేటకు చేరుకోగానే మరో ఇద్దరు వ్యక్తులు ఆటోలో ఎక్కి వెనుక సీట్లో యువతికి చెరోవైపు కూర్చున్నారు. మరోవ్యక్తి ఘట్‌కేసర్‌ శివారులో వ్యాన్‌తో సిద్ధంగా ఉన్నాడు. అక్కడ యువతిని బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించి మత్తుమందు ఇచ్చారు.

అందులోనే అందరూ అత్యాచారం చేశారు. అదే సమయంలో పోలీస్‌ వాహనాల సైరన్‌ మోగడం, ‘ఆటోలో అమ్మాయిని కిడ్నాప్‌ చేశారు..ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటూ’ పోలీసులు మైకుల్లో ప్రకటిస్తుండటాన్ని విన్న నిందితుల్లో ఆందోళన మొదలైంది. దొరికితే ఎన్‌కౌంటర్‌ చేస్తారని భయపడ్డారు. యువతిని వ్యాన్‌ నుంచి కిందకు దించి పక్కనే పొదల్లో పడేసి పరారయ్యారు. సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్‌ ఆధారంగా పోలీసులు బాధితురాలి జాడ గుర్తించారు. వైద్యపరీక్షలకు తరలించారు.

రాంపల్లి చౌరస్తా దగ్గర సీసీటీవీ ఫుటేజీని పోలీసులు జల్లెడ పట్టారు. ఆ క్రమంలోనే బాధితురాలితోపాటు మరో యువకుడు ఆటోలో ఎక్కినట్లు గుర్తించి విచారించారు. అతను చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా ఆరా తీశారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా నలుగుర్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు నిందితులపై అత్యాచారం, హత్యాయత్నం కేసులు నమోదుచేశారు.

నిందితులకు సంబంధించిన నేర చరిత్రపై పోలీసులు ఆరా తీయగా పలు విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఒంటరిగా కనిపించే మహిళలను లక్ష్యంగా చేసుకునేవాళ్లు.. 15 రోజులు గమనించిన తర్వాత ప్రధాన నిందితుడు అదును చూసి ఆటోలో ఎక్కించుకునేవాడు. ప్రయాణికులు దిగిపోగానే మరో ఇద్దరు స్నేహితుల్ని ఎక్కించుకుని కిడ్నాప్ చేసేవాళ్లు. మరో స్నేహితుడు ఘట్‌కేసర్‌కు సమీపంలోని ఓఆర్‌ఆర్‌ దగ్గర వ్యాన్‌తో వేచి ఉంటాడు.

మరో నలుగురిపై అత్యాచారానికి పాల్పడినట్లు నిందితులు అంగీకరించినట్లు తెలిసింది. ఫార్మసీ విద్యార్థిపై అత్యాచారం కేసులో నిందితులు ఉపయోగించిన ఆటో దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీల్లో రికార్డు అయ్యాయి. అయితే అదే వాహనంలో అమ్మాయి జర్నీ చేసిందా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి..

Singareni Job Notification : సింగరేణి కొలువులకు భారీగా పోటీ.. పరీక్షల్లో ఎక్కువగా వీటిపైనే ప్రశ్నలు..!

West Bengal Bandh : రసవత్తరంగా మారిన బెంగాల్‌ రాజకీయాలు.. ఉదయం నుంచే నిరసన సెగలు..