Transgender person: బాబు పుట్టిన వేళ కానుక ఇవ్వలేదని కిడ్నాప్ చేసి మరీ మూడు నెలల పనిగుడ్డుని చంపేసిన హిజ్రా

person:శుభకార్యాలు జరిగే సమయంలో హిజ్రాలు రావడం.. డబ్బులు డిమాండ్ చేస్తూ నానా హంగామా సృష్టించడం దేశంలోని అనేక ప్రాంతాల్లో మామూలే. అయితే, వాణిజ్య రాజధాని ముంబైలో..

Transgender person: బాబు పుట్టిన వేళ కానుక ఇవ్వలేదని కిడ్నాప్ చేసి మరీ మూడు నెలల పనిగుడ్డుని చంపేసిన హిజ్రా
Brutal Murder

Updated on: Jul 09, 2021 | 10:08 PM

Transgender person:శుభకార్యాలు జరిగే సమయంలో హిజ్రాలు రావడం.. డబ్బులు డిమాండ్ చేస్తూ నానా హంగామా సృష్టించడం దేశంలోని అనేక ప్రాంతాల్లో మామూలే. అయితే, వాణిజ్య రాజధాని ముంబైలో వీరి వ్యవహారం పెచ్చుమీరిపోయింది. అత్యంత కిరాతకంగా ముంబైలో మూడు నెలల పసిగుడ్డును చంపేసిందో హిజ్రా. ముక్కుపచ్చలారని చిన్నారిని కిడ్నాప్‌ చేసి మరీ అత్యంత కిరాతకానికి ఒడిగట్టింది.

చిన్నారి పుట్టినందుకు కానుకగా డబ్బులివ్వాలంటూ డిమాండ్ చేసింది ఆ హిజ్రా. ఆ కుటుంబం అంత ఇచ్చుకోలేమని చెప్పింది. దీంతో.. హిజ్రాకు కోపం కట్టలు తెంచుకుంది. నిద్రపోతున్న సమయంలో ముక్కు పచ్చలారని ఆ చిన్నారిని ఎత్తుకెళ్లిపోయి చంపేసింది.

పాప నిద్రిస్తున్న సమయంలో ఎత్తుకు పోయి ఈ దారుణానికి ఒడిగట్టింది సదరు హిజ్రా. ఈ ఘటనకు సంబంధించి ట్రాన్స్‌జెండర్ సహా ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. శుభకార్యాల సందర్భంలో డబ్బులు డిమాండ్ చేస్తూ హింసిస్తున్న హిజ్రాల వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Read also: Jammu and Kashmir: కసరత్తు మొదలైంది : జమ్ముకశ్మీర్‌లో డీలిమిటేషన్‌ ప్రాసెస్‌ స్పీడప్ చేసిన కేంద్రం