నైరుతి ఢిల్లీలోని సరోజినీ నగర్ ప్రాంతంలో పిస్టల్‌తో బెదిరించి ఓ వ్యక్తి ఇంట్లో చోరీకి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలో జైలు జీవితం గడిపిన ఒక వ్యక్తి ప్రేయసి అలక వహించడంతో.. ఆమెకు ఖరీదైన కానుకలు ఇచ్చి ప్రసన్నం చేసుకునేందుకు ఈ దోపిడీకి ప్లాన్ చేశాడు. నిందితులను ఆర్‌కె పురం నివాసి శుభం (20), నిజాముద్దీన్‌లో నివాసం ఉంటున్న ఆసిఫ్ (19), జామియా నగర్‌కు చెందిన మహ్మద్ షరీఫుల్ ముల్లా (41)గా గుర్తించారు. నేరస్తులను గుర్తించేందుకు స్పెషల్ టీమ్ నిఘా ఫుటేజీని సేకరించేందుకు ప్రయత్నించిందని, అయితే పరిసరాల్లో కెమెరాలు లేవని పోలీసులు తెలిపారు.
ఒక దొంగ.. మరొకరిని ‘శుభం’ అని పిలిచారని బాధితుడు పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులకు క్లూ దొరికింది. ‘శుభం’ అనే పేరుతో ఉన్న 150 మంది పాత నేరస్థల చిట్టాలను విప్పారు. దీంతో పోలీసులకు నిందితులను గుర్తించడం సులభమైంది. శుక్రవారం, సరోజినీ నగర్ ప్రాంతంలో దోపిడీకి గురైన స్కూటర్‌ను నడుపుతున్న శుభంతో పాటు అతని ఇద్దరు సహచరులను పోలీసులు పట్టుకున్నారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌరవ్ శర్మ తెలిపారు.
జైల్లో పరిచయం….
జులైలో సరోజినీ నగర్ ప్రాంతంలో మొబైల్ ఫోన్లు లాక్కున్న కేసులో అరెస్టయ్యానని, నవంబర్‌లో విడుదలైనట్లు విచారణలో శుభం వెల్లడించాడు. జైలులో ఉన్నప్పుడు ఆసిఫ్ ఫ్రెండ్ అయ్యాడని.. బయటకు రాగానే మళ్లీ కలిశాడని పోలీసులకు వివరించాడు. తామంతా కలిసి దోపిడికి ప్లాన్ చేసుకున్నట్లు పేర్కొన్నాడు. కాగా ‘శుభం’ గతంలో రెండు కేసుల్లో, ఆసిఫ్ మూడు కేసుల్లో, ముల్లా మూడు కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రెండు స్కూటర్లు, ఒక ల్యాప్‌టాప్, చోరీకి గురైన నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక బ్యాగ్‌తో పాటు బట్టలు, షూలు, ఒక చేతి గడియారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.
Also Read: పిల్లలు కలగలేదని ఇల్లాలికి బొడ్డుతాడు తినిపించారు..పాపం చివరికి
వివాహేతర సంబంధం బయటపెడతానని భయపెట్టి వివాహితపై బాలుడు అత్యాచారం