మధ్యప్రదేశ్‌లో భారీగా శానిటైజర్ బాటిల్స్‌ను సీజ్ చేశారు డీజీజీఐ అధికారులు. భోపాల్‌లోని రైసన్ ప్రాంతంలో సెహత్గంజ్ గ్రామంలో ఓ కంపెనీ బ్రాండెడ్ శానిటైజర్ బాటిల్స్‌ను తయారు చేస్తోంది. అయితే ఈ కంపెనీ జీఎస్టీ బిల్లులు చెల్లించకుండా అక్రమంగా శానిటైజర్ బాటిల్స్‌ను మార్కెట్లో అమ్మినట్లు గుర్తించారు. దాదాపు రూ.7.97 కోట్ల విలువైన శానిటైజర్ బాటిల్స్‌ను అక్రమంగా అమ్మి.. జీఎస్టీ ఎగవేసిందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో కంపెనీలో తనిఖీలు చేయగా.. రూ.20.40 కోట్ల విలువైన శానిటైజర్ బాటిల్స్ ఉన్నట్లు గుర్తించారు. వీటన్నింటిని అధికారులు సీజ్ చేశారు. కాగా, గత రెండు వారాలుగా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశామని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కంపెనీకి చెందిన ఇద్దరు డైరక్టర్లను అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
Three persons arrested in Bhopal and branded hand sanitizers amounting to Rs 20.40 Crore seized, for GST evasion of about Rs 7.97 crore: Directorate General of GST Intelligence, Bhopal #Madhyapradesh
— ANI (@ANI) July 9, 2020