Hyderabad Drugs Seized: హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. మరోసారి నగరంలో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున్న విదేశాల నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ను తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కొకైన్‌తో పాటు ఇతర మత్తు పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ ముఠా డ్రగ్స్‌ను ఎక్కడికి సరఫరా చేసిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు భారీగా కొకైన్‌ను పట్టుకున్నారు. దాదాపు రూ.11.57కోట్ల విలువైన 1,157 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. టాంజానియా దేశానికి చెంది ఓ వ్యక్తి నుంచి ఈ కొకైన్‌ను రికవరీ చేసుకున్నట్లు వెల్లడించారు. సదరు వ్యక్తి ఈ నెల 21న ఆఫ్రికా నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. శంషాబాద్‌కు రాగా.. కొకైన్‌ను మాత్రల రూపంలోకి కడుపులోకి తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తం 79 క్యాప్సూల్స్ స్వాధీనం చేసుకున్నట్లు DRI అధికారులు తెలిపారు.