girl honey trap: విద్యార్థి ప్రాణం తీసిన వీడియోకాల్‌.. కిలాడీ లేడీ వలలో పడి బలవన్మరణం..!

| Edited By: Sanjay Kasula

Apr 01, 2021 | 3:03 PM

నిజామాబాద్ జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ముఠా చేతిలో మోసపోయిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

girl honey trap: విద్యార్థి ప్రాణం తీసిన వీడియోకాల్‌.. కిలాడీ లేడీ వలలో పడి బలవన్మరణం..!
Suicide
Follow us on

honey trap: నిజామాబాద్ జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ముఠా చేతిలో మోసపోయిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే ఒక వీడియో కాల్‌ యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దిమ్మ తిరిగిపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఇంట్లో ఎవరూ లేరు. ఏకాంతంలో ఎంజాయ్‌ చేద్దామంటూ ఆకర్షిస్తారు. తీరావచ్చాక ఉన్నదంతా దోచేస్తారు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది.

నిజామాబాద్‌ జిల్లా నవీపేటకు చెందిన యువకుడు హైదరాబాద్‌లో ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. నేను సింగిల్‌. నీతో చాట్‌ చేయాలని అనుకుంటున్నా.. అంటూ యువకుడి ఫోన్‌కి మేసేజ్‌ వచ్చింది. ఆ ఫోన్‌ నెంబర్‌కు ఫోన్‌ చేస్తూ ఓ లేడీ కవ్వింపు మాటలతో ఆకట్టుకుంది. ఆ తర్వాత వీడియో కాల్‌ చేసి చాటింగ్‌ మొదలుపెట్టింది. నగ్న వీడియోలు కావాలంటూ రెచ్చగొట్టి ట్రాప్‌ చేసింది.

ఆ తర్వాత నుంచి యువకుడికి వేధింపులు పెరిగాయి. డబ్బులు ఇవ్వకపోతే వీడియోలు యూట్యూబ్‌లో పెడతానంటూ టార్చర్‌ పెట్టింది. దీంతో తన బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న రూ. 24 వేలు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. అయినా బెదిరింపులు ఆగలేదు. ఇంకా కావాలంటూ ఫోన్‌ చేసి యువతి గ్యాంగ్‌ వార్నింగ్‌లు ఇచ్చింది. దీంతో భయపడిన యువకుడు నాలుగు రోజుల కిందట సొంతూరు వెళ్లాడు. అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు..

నగ్నంగా ఉండే యువతులతో మాట్లాడించి డబ్బులు దండుకునే ముఠా చేతిలో చిక్కిన విద్యార్థి, వారి వేధింపులు తాళలేక చివరికి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆలస్యంగా తల్లిదండ్రులు తెలుసుకున్నారు. ఇలాంటి ముఠాలు ఇటీవల పెరిగాయని…ఫోన్‌కు వచ్చే మేసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Read Also…  Vijayashanthi : నాపై అక్రమ కేసులు పెట్టి, భయాందోళనకు గురి చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు : విజయశాంతి