Watch Video: నివురుగప్పిన నిప్పులా బోధన్‌.. పోలీసుల ముందు లొంగిపోయిన శివ సేన గోపి..

|

Mar 22, 2022 | 4:38 PM

ఇటు 144 సెక్షన్..! అటు బంద్..! బోధన్‌ నివురుగప్పిన నిప్పులా మారిపోయింది. శివసేన, బీజేపీ ఇచ్చిన పిలుపుతో బంద్‌ కొనసాగింది.

Watch Video: నివురుగప్పిన నిప్పులా బోధన్‌.. పోలీసుల ముందు లొంగిపోయిన శివ సేన గోపి..
Bodhan Town
Follow us on

ఇటు 144 సెక్షన్..! అటు బంద్..! బోధన్‌ (Bodhan Town)నివురుగప్పిన నిప్పులా మారిపోయింది. శివసేన(Shiv Sena), బీజేపీ(BJP) ఇచ్చిన పిలుపుతో బంద్‌ కొనసాగింది. ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటుచేశారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. వివాదానికి కారణమైన శివాజీ విగ్రహం చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేశారు. విగ్రహం చుట్టూ ప్రత్యేక పికెట్, బారికేడ్లతో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. శివాజీ విగ్రహానికి సుమారు 300 మీటర్ల వరకు ఎవర్ని అనుమతించడం లేదు. పట్టణంలోని సున్నిత ప్రాంతాల్లో పోలీస్‌ పికెటింగ్‌ అమలు చేస్తున్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు బోధన్‌లో 144 సెక్షన్‌ కొనసాగించనున్నారు. బోధన్‌ ఘటనలో ఇప్పటి వరకు ఇరువర్గాలకు చెందిన 24 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. పోలీసుల నమోదు చేసిన రిమాండ్ రిపోర్ట్ వివరాలను టీవీ9 వద్ద ఉన్నాయి. రిమాండ్ రిపోర్టులో 35 మంది పేర్లు నమోదు చేశారు బోధన్ టౌన్ పోలీసులు.

ఇందులో ఇప్పటి వరకు 15 మందిని సోమవారం సాయంత్రం రిమాండ్‌కు తరలించారు పోలీసులు. మరో 20 మంది పరారీలో ఉన్నట్లుగా రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నా పోలీసులు. బోధన్ పట్టణంలోని రైల్వే ట్రాక్ వద్ద అల్లర్లు హత్యాయత్నంకు పాల్పడినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు.

IPC 147, 148, 307, 353,188, r/w 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు. నేరం రుజువైతే పది సంవత్సరాలు అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంది. పరారీలో ఉన్న వారు వెంటనే పోలీస్ స్టేషన్లో లొంగిపోవాలని వారి కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేసిన బోధన్ టౌన్ పోలీసులు.

ఇదిలావుంటే..  శివ సేన గోపి బోధన్ పోలీస్‌ల ముందు లొంగిపోయారు. లొంగిపోయే ముందు మరోసారి వీడియోను మీడియాకు విడుదల చేశారు గోపి. ఈ వీడియోలో గోపి మాట్లాడుతూ..” నాకు శివాజీ విగ్రహం పెట్టడం గర్వాంగ ఉంది. మున్సిపల్ తీర్మానం చేసిన స్థలంలోనే శివాజీ విగ్రహం ఏర్పాటు చేశాను. నా వ్యక్తిగత పనుల వాల్ల నేను స్థానికంగా  అందుబాటులో లేను. అయితే ఈ రోజు బోధన్ పోలీసులకు లొంగిపోతున్నాను. ” అంటూ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి: బెంగాల్ మరో దారుణం.. పది మంది సజీవ దహనం.. మృతుల్లో చిన్నారులతోపాటు మహిళలు..

Amaranth Health Benefits: వీరికి ఈ చిరుధాన్యలు దివ్యమైన ఆహారం.. ఎన్ని లాభాలో తెలిసిస్తే..