సిగరెట్లతో కాల్చి, మెడకు ప్లాస్టర్ బిగించి అతి కిరాతకంగా చంపింది.. ఆఖరికి పోలీసులకు చిక్కింది..

|

Dec 06, 2020 | 7:38 PM

తొమ్మిదేళ్ల వయసున్నపిల్లాడిని కనికరం లేకుండా అతి కిరాతకంగా చంపింది ఓ మహిళ. సిగరెట్లతో కాల్చి, మెడకు ప్లాస్టర్ బిగించి

సిగరెట్లతో కాల్చి, మెడకు ప్లాస్టర్ బిగించి అతి కిరాతకంగా చంపింది.. ఆఖరికి పోలీసులకు చిక్కింది..
Follow us on

తొమ్మిదేళ్ల వయసున్నపిల్లాడిని కనికరం లేకుండా అతి కిరాతకంగా చంపింది ఓ మహిళ. సిగరెట్లతో కాల్చి, మెడకు ప్లాస్టర్ బిగించి చిత్రహింసలు పెట్టింది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన ఈ ఘటన అక్కడి వారిని కలిచివేసింది. వివరాల్లోకి వెళితే..

జేమీ లైన్ జాక్స‌న్‌ అనే మహిళకు ప‌న్నెండేళ్ల లోపు వ‌య‌సున్న‌ ఇద్ద‌రు పిల్ల‌లున్నారు. ఆమె మేన‌ల్లుడు మిచెల్ స్టోవ‌ర్‌ వీరితో క‌లిసి ఆడుకుంటున్నాడు. తొమ్మిదేళ్ల వ‌య‌సున్న‌ ఈ పిల్ల‌వాడు ఎక్క‌డ ప‌డితే అక్క‌డ టాయ్‌లెట్ పోయ‌డంతో ఆమెకు విపరీతంగా కోపం వచ్చింది. దీంతో పిల్లవాడు అని చూడకుండా చిత్రహింసలు పెట్టింది. బాలుడి మెడకు ప్లాస్టర్ బిగించి, శరీరమంతా సిగరెట్లతో కాల్చింది. తర్వాత క్లాత్‌లో చుట్టి బాత్ రూంలో టబ్‌లో పడేసింది. అందులో పిల్లవాడు ఊపిరాడక కొట్టుకుంటుంటే చూసి రాక్షస ఆనందం పొందింది. అయితే ఇంటికి వచ్చిన ఒకరు ఈ విషయాన్ని గమనించాడు. అనుమానంతో పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు జేమీ లైన్ జాక్స‌న్‌ ఇంటికి చేరుకునే సరికి పల్లవాడు చనిపోయి ఉన్నాడు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టారు. పలు కేసుల కింద కోర్టు ఆమెకు జైలు శిక్ష విధించింది.