బీజేపీ నాయకురాలు, టిక్‌టాక్ స్టార్ సోనాలీ ఫొగాట్ ఇంట్లో భారీ చోరీ.. సీసీ టీవీ ఫుటేజీని సైతం ఎత్తుకెళ్లిన దొంగలు..

Robbery in Sonali Phogat House: టిక్‌టాక్‌ స్టార్‌, హర్యానా బీజేపీ నాయకురాలు సొనాలీ ఫొగాట్‌ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌, రూ. పది లక్షల..

  • Shaik Madarsaheb
  • Publish Date - 12:10 am, Wed, 17 February 21
బీజేపీ నాయకురాలు, టిక్‌టాక్ స్టార్ సోనాలీ ఫొగాట్ ఇంట్లో భారీ చోరీ.. సీసీ టీవీ ఫుటేజీని సైతం ఎత్తుకెళ్లిన దొంగలు..

Robbery in Sonali Phogat House: టిక్‌టాక్‌ స్టార్‌, హర్యానా బీజేపీ నాయకురాలు సొనాలీ ఫొగాట్‌ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌, రూ. పది లక్షల నగదుతో పాటు విలువైన వస్తువులు చోరీకి గురైనట్టు పోలీసులు మంగళవారం వెల్లడించారు. అయితే సొనాలీ ఫొగాట్ చండీఘఢ్‌లో ఉన్న సమయంలో ఈ చోరీ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు సొనాలీ ఫొగాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. సొనాలీ ఇంటి వద్ద సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. అయితే దొంగలు డిజిటల్‌ వీడియో రికార్డర్‌లో ఉన్న ఫుటేజీని కూడా తీసుకెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. ఈ చోరీ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్‌టీఎం స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ సుఖ్‌జిత్‌ వెల్లడించారు.

ఈ నెల 9న తాను ఇంటికి తాళం వేసి చండీఘఢ్‌కు వెళ్లానని.. ఆ సమయంలో తన ఇంట్లో చోరీ జరిగిందని ఫొగట్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 15న తిరిగి హిసార్‌లోని తన నివాసానికి వచ్చే సరికి తాళాలు పగలగొట్టి ఉన్నాయని ఫిర్యాదులో వెల్లడించారు. బంగారం, వెండి ఆభరణాలు, రూ.10 లక్షల నగదు, లైసెన్స్‌డ్‌ తుపాకీ పలు వస్తువులు చోరీకి గురైనట్లు తెలిపారు. అయితే సొనాలీ ఫొగాట్ 2019లో హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆదంపూర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.

Also Read:

మధ్యప్రదేశ్‌లో అమానుషం.. ఓ గిరిజన మహిళపై యువకుడిని కూర్చొబెట్టి ఊరేగించిన స్థానికులు

కూతురిని సజీదహనం చేసిన కసాయి తండ్రి.. ఇష్టంలేని పెళ్లి చేసుకుందని కక్ష.. సుపారీ హంతకుడితో అమానుషం.!