Telugu News Crime Pregnant women commits suicide due to family members harresement
నిండు గర్భిణీ ఆత్మహత్య..అత్తింటి వేధింపులే కారణం
అనంతపురం జిల్లా బుక్కపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో నిండు గర్భిణీ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు శ్యామల అత్తింటి వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడినట్లుగా గుర్తించినపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేప్టటారు. మహిళ ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు పరిశీలించగా… బుక్కపట్నానికి చెందిన నాగలాల్, సరోజల మూడవ సంతానం శ్యామల. కర్నాటక రాష్ట్రం గౌరిబిదనూరుకి చెందిన మాంసం వ్యాపారి సునీల్‌తో శ్యామలకు 9 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 8 […]
అనంతపురం జిల్లా బుక్కపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో నిండు గర్భిణీ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు శ్యామల అత్తింటి వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడినట్లుగా గుర్తించినపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేప్టటారు. మహిళ ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు పరిశీలించగా…
బుక్కపట్నానికి చెందిన నాగలాల్, సరోజల మూడవ సంతానం శ్యామల. కర్నాటక రాష్ట్రం గౌరిబిదనూరుకి చెందిన మాంసం వ్యాపారి సునీల్‌తో శ్యామలకు 9 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 8 ఏళ్ల కూతురు కూడా ఉంది. అయితే, మొదటి సంతానం ఆడపిల్ల కావడంతో అప్పట్నుంచి శ్యామలకు అత్తింటి వేధింపులు మొదలైనట్లుగా ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండోసారి గర్భందాల్చిన శ్యామలకు స్కానింగ్‌లో పుట్టబోయేది ఆడపిల్లే అని తేలడంతో అత్తామామల వేధింపులు మరీ ఎక్కువయ్యాయని, దీంతో పుట్టింటికి చేరిన శ్యామల వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్తానని చెప్పి చెరువులో దూకి ప్రాణాలు తీసుకుందని తెలిపారు. తమ కూతుర్ని అబార్షన్ చేయించుకోవాలని బలవంతం చేయడంతో ప్రాణాలు తీసుకున్నట్లుగా వారు ఆరోపించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శ్యామల అత్తమామ, ఆడబిడ్డలను అదుపులోకి తీసుకున్న పోలీసులు..తమదైన శైలిలో విచారణ చేపట్టారు. పుట్టబోయేది ఆడపిల్ల అని చెప్పిన స్కాన్ సెంటర్‌పై కూడా పోలీసులు ఆరా తీశారు. చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడిన వైద్యులు, ఆస్పత్రిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కొత్తచెరువు సీఐ బాల సుబ్రమణ్యం పేర్కొన్నారు