ఇంత ఘోరమా… జాతీయ జెండానే తగలబెడతాడా.. ?..ఓ సర్పంచ్ సోదరుడి నిర్వాకం…

దేశ వ్యాప్తంగా ఆదివారం రోజు ఓ వైపు జాతీయ జెండాను ఎగరవేస్తూ.. గణతంత్ర వేడుకలు జరుపుకుంటుంటే.. మరోవైపు ఆ జాతీయ జెండాని తగలబెట్టాడో సర్పంచ్ సోదరుడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం తిరుమలపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జనవరి 26 గణతంత్ర వేడుకల సందర్బంగా.. ఉదయం తిరుమలపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి జాతీయ జెండాను ఎగరవేశారు. అయితే ఆ సమయంలో.. ఆ గ్రామ సర్పంచ్ అక్కడ లేడని తెలుస్తోంది. […]

ఇంత ఘోరమా... జాతీయ జెండానే తగలబెడతాడా.. ?..ఓ సర్పంచ్ సోదరుడి నిర్వాకం...

Updated on: Jan 27, 2020 | 1:14 PM

దేశ వ్యాప్తంగా ఆదివారం రోజు ఓ వైపు జాతీయ జెండాను ఎగరవేస్తూ.. గణతంత్ర వేడుకలు జరుపుకుంటుంటే.. మరోవైపు ఆ జాతీయ జెండాని తగలబెట్టాడో సర్పంచ్ సోదరుడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం తిరుమలపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జనవరి 26 గణతంత్ర వేడుకల సందర్బంగా.. ఉదయం తిరుమలపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి జాతీయ జెండాను ఎగరవేశారు. అయితే ఆ సమయంలో.. ఆ గ్రామ సర్పంచ్ అక్కడ లేడని తెలుస్తోంది. అయితే సర్పంచ్ లేకుండా జాతీయ జెండా ఎగరవేస్తారా అంటూ.. ఆ సర్పంచ్ సోదరుడు నానా హంగామా చేశాడు. అంతేకాదు.. ఆగ్రహంతో యావత్ దేశం సెల్యూట్ చేసే జాతీయ జెండానే తగలబెట్టాడు. వెంటనే ఈ ఘటనపై కారోబార్‌ రమేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. జెండాను తగలబెట్టిన నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా.. ఇదే అంశంపై సర్పంచ్‌‌కు.. పంచాయతీ కార్యదర్శి, గ్రామ కారోబార్‌ల మధ్య గొడవకు దారితీసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us