Raj Kundra: రాజ్‌ కుంద్రాకు నిరాశ.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ.. జ్యూడిషియల్‌ కస్టడీకి తరలింపు..

Raj Kundra Case: పోర్నోగ్రఫి కేసులో ప్రధాన నిందితుడు, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రా బెయిల్‌ పిటిషన్‌ను ముంబై కోర్టు

Raj Kundra: రాజ్‌ కుంద్రాకు నిరాశ.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ.. జ్యూడిషియల్‌ కస్టడీకి తరలింపు..
Raj Kundra

Updated on: Jul 27, 2021 | 3:39 PM

Raj Kundra Case: పోర్నోగ్రఫి కేసులో ప్రధాన నిందితుడు, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రా బెయిల్‌ పిటిషన్‌ను ముంబై కోర్టు తిరస్కరించింది. ఈ మేరకు రాజ్‌కుంద్రాకు 14 రోజుల పాటు జ్యూడిషియల్‌ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. పోర్నోగ్రఫి కేసులో రాజ్‌ కుంద్రా అరెస్ట్ అనంతరం.. పోలీసు కస్టడీ మంగళవారంతో ముగిసింది. దీంతో పోలీసులు రాజ్‌కుంద్రాను ముంబై కోర్టులో హాజరుపర్చారు. పోర్నోగ్రఫి రాకెట్ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని.. కస్టడీకి అప్పగించాలంటూ క్రైం బ్రాంచ్ పోలీసులు కోర్టుకు విన్నవించారు. ఈ మేరకు ధర్మాసనం రాజ్‌కుంద్రాకు 14 రోజులపాటు జ్యూడిషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

పోర్నోగ్రఫీ కేసులో ఈ నెల 19న రాజ్‌ కుంద్రాను అరెస్టు చేసిన తర్వాత.. క్రైం బ్రాంచ్ పోలీసులు పలు కీలక ఆధారాలను సేకరించారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. ఇదిలాఉంటే.. రాజ్‌ కుంద్రా మార్చిలోనే తన అరెస్ట్‌ను ఊహించాడని.. ఈ క్రమంలో తన ఫోన్‌ను సైతం మార్చాడని క్రైమ్ బ్రాంచ్‌ దర్యాప్తులో వెల్లడైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. రాజ్‌ కుంద్రా-శిల్పా శెట్టి దంపతుల బ్యాంక్ ఖాతాలను పరిశీలించడానికి క్రైమ్ బ్రాంచ్ అఫ్టికల్స్ స్వతంత్ర ఆడిటర్‌ను కూడా నియమించుకున్నట్లు తెలుస్తోంది.

కాగా.. రాజ్‌ కుంద్రా పోర్నోగ్రఫి కేసుకు సంబంధించి మొదటి నుంచీ వార్తల్లో ఉన్న నటి-మోడల్‌ షెర్లిన్ చోప్రాకు సోమవారం ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. మంగళవారం తమ ముందు హాజరు కావాలని క్రైమ్ బ్రాంచ్ ప్రాపర్టీ సెల్ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.

Also Read:

CM BS Yediyurappa: కర్ణాటక సీఎం యడియూరప్ప అభిమాని ఆత్మహత్య.. రాజీనామా జీర్ణించుకోలేక దారుణం..!

Pragya Jaiswal: ఏకాంతంగా గడపడం వల్ల ప్రగ్యాకు ఆ అవకాశం దొరికిందట.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన అందాల భామ.

Loading...
Unable to load recommendations.
Follow Us