Hyderabad Crime News: హైదరాబాద్ నడి రోడ్డుపై దారుణ హత్య.. వేటకొడవళ్లతో యువకుడిని వెంటాడి వేటాడి..

|

Oct 13, 2021 | 7:16 PM

Hyderabad Crime News: హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని దారుణ ఘటన చోటు చేసుకుంది. హస్మాబాద్ బండ్ల గూడ రోడ్ పై ఓ యువకుడిని..

Hyderabad Crime News: హైదరాబాద్ నడి రోడ్డుపై దారుణ హత్య.. వేటకొడవళ్లతో యువకుడిని వెంటాడి వేటాడి..
Hyderabad Crime News
Follow us on

Hyderabad Crime News: హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని దారుణ ఘటన చోటు చేసుకుంది. హస్మాబాద్ బండ్ల గూడ రోడ్ పై ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు వేటాడి దారుణంగా హత్య చేశారు.  సమాచారం అందుకున్న పోలీసులు
సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నడిరోడ్డు పై జరిగిన దుండగుల దాడిలో మరణించిన వ్యక్తి పాతబస్తీ బర్కస్ కి చెందిన హమీద్ బిన్ ఆల్ జుబేది గా పోలీసులు గుర్తించారు. క్లూస్ టీం తో ఆధారాలు సేకరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే

హైదరాబాద్ పాతబస్తీ బర్కస్ కి చెందిన వ్యక్తి హమీద్ బిన్ ఆల్ జుబేది వెస్టర్న్ యూనియన్ ఆఫ్ మనీ నిర్వహిస్తున్నాడు. ఈ రోజు హమీద్ బండ్ల గూడా ప్రధాన రహదారి పై కారులో వెళ్తుండగా.. రోడ్డు మీద కొందరు గుర్తు తెలియని దుండగులు కారు ఆపి మరణయుధాలతో దాడి చేసేశారు.    కారులో వెళ్తున్న హమీద్ ను బండ్లగూడా వద్ద ముగ్గురు వ్యక్తులు అడ్డగించి కత్తులతో దాడి చేసి అక్కడి నుండి పారిపోయారు. ఇది చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా  స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన హమీద్ ని 108లో ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారు. అయితే అప్పటికే వైద్యులు హమీద్ చనిపోయాడని నిర్ధారించారు.  ఈ ఘటనపై చంద్రయన్ గుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.. ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read: Pelli sandaD: ఒంగోలులో సందడి చేసిన పెళ్ళిసందడి చిత్ర యూనిట్ రోషన్, శ్రీ లీల.. చిత్ర యూనిట్