హెర్బల్ ఆయిల్ పేరుతో కుచ్చు టోపి.. వ్యాపారవేత్త నుంచి రూ.52లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

హెర్బల్‌ ఆయిల్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఓ వ్యాపారవేత్తకు కుచ్చుటోపి పెట్టారు. అతడి నుంచి రూ.52లక్షలు కాజేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎస్సార్‌ నగర్‌ పరిధిలో జరిగింది.

హెర్బల్ ఆయిల్ పేరుతో కుచ్చు టోపి.. వ్యాపారవేత్త నుంచి రూ.52లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
Follow us

| Edited By:

Updated on: Nov 12, 2020 | 9:12 PM

cyber fraudsters money extortion: హెర్బల్‌ ఆయిల్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఓ వ్యాపారవేత్తకు కుచ్చుటోపి పెట్టారు. అతడి నుంచి రూ.52లక్షలు కాజేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎస్సార్‌ నగర్‌ పరిధిలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. కొండల్‌ రెడ్డి అనే ఓ వ్యాపారవేత్త వివిధ సంస్థలకు అవసరమైన సామాగ్రిని సరఫరా చేసేవాడు. ఆయనకు ఆన్‌లైన్‌లో జాన్ డేనియల్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తాను జుమాక్‌ ఫార్మాస్యుటికల్స్ ప్రతినిధిగా చేస్తున్నట్లు డేనియల్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తనకు ఆక్సోనో హెర్బల్ ఆయిల్ లిక్విడ్ కావాలని కొండల్‌ రెడ్డిని కోరాడు. ఈ క్రమంలో జుమాక్ చీఫ్‌ ఎగ్జిగ్యూటివ్‌ ఆఫీసర్‌గా చెప్పుకున్న మరో వ్యక్తితో లావాదేవీలు నిర్వహించిన కొండల్‌ రెడ్డి సదరు ఆయిల్‌ కొటేషన్‌ని అతడికి పంపాడు. (కరోనా నుంచి కోలుకున్న స్మృతి ఇరానీ)

తరువాత తమకు 500 లీటర్ల ఆక్సోనో హెర్బల్‌ ఆయిల్ కావాలని అతడు కొండల్‌ రెడ్డికి ఆర్డర్ చేశాడు. ఈ క్రమంలో జుమాక్ సంస్థ ప్రతినిధులు సూచించిన విధంగా రాకేష్‌ కుమార్ అనే వ్యక్తిని కొండల్‌ రెడ్డి సంప్రదించారు. ఆయిల్‌ సరఫరా కోసం రూ.42.63లక్షలను రాకేష్‌ చెప్పిన ఖాతాలకు కొండల్‌ రెడ్డి పంపారు. అయితే వారు ఆయిల్‌ని పంపలేదు. ఈ లోగా కొండల్‌ రెడ్డికి హరిప్రీత్‌ అనే మరొకరు ఫోన్ చేశాడు. రూ.10లక్షలు పంపాలని లేకపోతే ఆర్డర్ క్యాన్సిల్ అవుతుందని చెప్పాడు. దీంతో ఆ పది లక్షలను కొండల్ రెడ్డి పంపాడు. అయితే ఆయిల్‌ రాకపోగా.. రాకేష్‌ , హరిప్రీత్‌ ఫోన్లు స్విచ్ఛాప్ అయ్యాయి. దీంతో మోసపోయానని గ్రహించిన అతడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ అజయ్‌కుమార్ అన్నారు. (ఢిల్లీలో విజృంభిస్తోన్న కరోనా.. ఒక్కరోజే 8వేలకు పైగా కేసుల నమోదు)

బేకరీల్లో లభించే ఆనియన్ కచోరిని ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చిలా!
బేకరీల్లో లభించే ఆనియన్ కచోరిని ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చిలా!
ఇక్కడి చింతచెట్టు గింజలు ఎక్కడా మొలకెత్తవు ఈ ఆలయంలో అన్నీ వింతలే
ఇక్కడి చింతచెట్టు గింజలు ఎక్కడా మొలకెత్తవు ఈ ఆలయంలో అన్నీ వింతలే
మీ జనన ధృవీకరణ పత్రం పోయిందా..?  ఇలా దరఖాస్తు చేసుకోండి!
మీ జనన ధృవీకరణ పత్రం పోయిందా..?  ఇలా దరఖాస్తు చేసుకోండి!
గుండె జబ్బులున్న వారు ఎక్కువ నీరు తాగకూడదా? నిపుణులు ఏమంటున్నారు?
గుండె జబ్బులున్న వారు ఎక్కువ నీరు తాగకూడదా? నిపుణులు ఏమంటున్నారు?
పీతల కర్రీ చేయడం రాదా.. ఇదిగో ఈ రెసిపీ ఫాలో అయిపోండి!
పీతల కర్రీ చేయడం రాదా.. ఇదిగో ఈ రెసిపీ ఫాలో అయిపోండి!
ఎర్ర ఉల్లిగడ్డ, తెల్ల ఉల్లిగడ్డలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా.?
ఎర్ర ఉల్లిగడ్డ, తెల్ల ఉల్లిగడ్డలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా.?
నిశిధీలో అందాల రాకూమారి.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..
నిశిధీలో అందాల రాకూమారి.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..
మీక్కూడా తినగానే ఈ అలవాటు ఉందా.? దంతాలు డేంజర్‌లో పడ్డట్లే..
మీక్కూడా తినగానే ఈ అలవాటు ఉందా.? దంతాలు డేంజర్‌లో పడ్డట్లే..
ఇంట్లో ఏ దిక్కులో ఏ ఫొటోలు పెట్టాలో తెలుసా.?
ఇంట్లో ఏ దిక్కులో ఏ ఫొటోలు పెట్టాలో తెలుసా.?
ఈ సూపర్ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా ?..
ఈ సూపర్ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా ?..